Eknath Shinde: ఏడు నగరాల్లో డే కేర్‌ కీమోథెరఫీ సెంటర్లు: ఏక్‌నాథ్‌ శిందే వెల్లడి

Eenadu icon
By National News Team Published : 10 Feb 2025 00:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఠానే: క్యాన్సర్‌ రోగులకు చికిత్స కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఏడు నగరాల్లో డే కేర్‌ కీమోథెరఫీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) వెల్లడించారు. క్యాన్స్‌ రోగులకు వైద్య సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వీటిని ఠానే, షోలాపుర్‌, అహల్యనగర్‌, ఛత్రపతి శంభాజీనగర్‌, నాందేడ్‌, వార్ధాలలో ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు సేవలందించేందుకు ఎనిమిది మొబైల్‌ వ్యాన్‌లు, 102 అంబులెన్సులు, ఏడు అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్సులు, రెండు సిటీ (కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ) యంత్రాలు, 80 డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలను సమకూరుస్తామని తెలిపారు.

బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్‌ మొదలైన పరీక్షలను కవర్‌ చేసే ఈ కొత్త ప్రోగ్రామ్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలు సమగ్ర ఆరోగ్య తనిఖీలు పొందుతారన్నారు. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సరైన వైద్యసాయం అందేలా మొబైల్ హెల్త్‌ చెకప్‌ యూనిట్లు పనిచేస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైద్య సహాయ సెల్‌ ద్వారా 51వేల మంది రోగులకు రూ.460 కోట్ల ఆర్థిక సాయం అందించామని.. అదే తరహాలో ఉప ముఖ్యమంత్రి వైద్య సహాయ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా, గడ్చిరోలి, చంద్రాపుర్‌, సింధూ దుర్గ్‌, పుణె, రత్నగిరి, రాయగఢ్‌ జిల్లాలకు ఏడు అధునాతన లైఫ్‌ సపోర్టు (ALS) అంబులెన్సుల్ని మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు