Caste Census: కర్ణాటకలో మళ్లీ కొత్తగా కులగణన.. సీఎం ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో మళ్లీ కొత్తగా కులగణన (Caste Census) చేపట్టనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. గతంలో ఇచ్చిన నివేదికను అంగీకరించబోమని.. సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 7 మధ్య మళ్లీ కులగణన చేపడతామని వెల్లడించారు. గతంలో చేపట్టిన కులగణన సమాచారం దాదాపు పదేళ్ల కిందటిది గనక ప్రస్తుతం సమాజంలోని వాస్తవాలను తెలుసుకోవడానికి కొత్తగా సర్వే అవసరమని ఆయన అన్నారు.
‘‘సమాజంలో అనేక కులమతాలతో పాటు సామాజిక అసమానతలు కూడా ఉన్నాయి. దేశంలోని ప్రజలంతా సమానమేనని.. ప్రజలందరికీ సమాన సామాజిక న్యాయం జరగాలని రాజ్యాంగం చెబుతోంది. దాని ప్రకారమే.. ప్రజల మధ్య అసమానతలను తొలగించి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు సృష్టించే దిశగా ముందడుగు వేయడానికి మేము నిర్వహించే నూతన సర్వే(Caste Census) ఉపయోగపడుతుంది’’ అని సిద్ధరామయ్య తెలిపారు.
2015లో కర్ణాటక (Karnataka) వెనకబడినవర్గాల కమిషన్ జస్టిస్ కాంతరాజ నేతృత్వంలో కులగణన (Caste Census) చేపట్టగా, ఈ డేటా ఆధారంగా కె.జయప్రకాశ్ హెగ్డే నేతృత్వంలో పూర్తిస్థాయి నివేదిక తయారుచేసి గతేడాది సర్కారుకు సమర్పించిన విషయం తెలిసిందే. కులగణన, ఆర్థిక, సామాజిక సమీక్షపై రూపొందించిన ఈ నివేదికను కర్ణాటక సర్కారు గతంలోనే ఆమోదించింది. నిపుణులు రూపొందించిన ఈ నివేదికపై భిన్నాభిప్రాయాలు, పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవడంతో రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టనున్నట్లు ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో మళ్లీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ఇటీవల కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 


