Bengaluru Stampede: అప్పుడు వారు రాజీనామా చేయలేదేం?: సిద్ధరామయ్య కౌంటర్

బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవం వేళ జరిగిన తొక్కిసలాట(Bengaluru Stampede)లో 11 మంది మృతికి బాధ్యత వహిస్తూ కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు రాజీనామా చేయాలన్న భాజపా నేతల డిమాండ్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) ఘాటుగా స్పందించారు. తనను రాజీనామా అడిగే ముందు భాజపా పాలిత రాష్ట్రాల్లో పలుచోట్ల గతంలో జరిగిన విషాదాలకు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేసిన భాజపా నేతల జాబితాను విడుదల చేయాలన్నారు. ఈ మేరకు ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘గుజరాత్‌లోని మోర్బిలో ఓ వంతెన కూలి అనేకమంది మృతి చెందారు. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలోనూ 30మంది యాత్రికులు మృతి చెందారు. ఆయా విషాద ఘటనల సమయంలో భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు రాజీనామా చేయలేదు సరికదా.. దర్యాప్తు కూడా తగిన విధంగా చేపట్టలేదు’’ అని ఆక్షేపించారు. అందువల్ల ఇప్పుడు తనని ప్రశ్నించేందుకు భాజపా నేతలకు ఏం నైతికత ఉందని నిలదీశారు.
‘‘దేశంలోని పలుచోట్ల విమాన ప్రమాదాలు, రైల్వే విషాదాల్లో చాలా మంది మరణించారు. గత కొన్నేళ్లుగా మణిపుర్ మండుతూనే ఉంది. రోజూ అక్కడ ప్రజలు చనిపోతున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో వంతెనలు కూలిపోవడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ భాజపా రాజీనామా చేసిందా? ఇది నేను సాకుగా చూపి చెప్పడం కాదు. ఇదంతా వాస్తవం. మనుషుల ప్రాణాలు, బాధలతో రాజకీయాలు చేయడం తగదని భాజపా నేతలు గ్రహించాలి’’ అన్నారు.
కర్ణాటకలోని తమ ప్రభుత్వం ఏడు కోట్ల మంది కన్నడిగులకు జవాబుదారీగా ఉంటుందని సీఎంం సిద్ధరామయ్య అన్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో బాధ్యులైన వారిపై ప్రాథమిక ఆధారాలను బట్టి చర్యలు తీసుకున్నామన్నారు. జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. కఠిన చర్యలకు తాము వెనుకాడబోమని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 


