Tejashwi Yadav: సభలో మాట్లాడుతుండగా తేజస్వీ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌!

Eenadu icon
By National News Team Updated : 29 Jun 2025 18:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్నా: ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav) ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు ఓ డ్రోన్‌ దూసుకురావడం కలకలం రేపింది. పట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌లో ‘సేవ్‌ వక్ఫ్‌, సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరిట ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ర్యాలీని కవర్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన డ్రోన్‌.. తేజస్వీ యాదవ్‌ ప్రసంగం మధ్యలో ఆయన వైపు తిరిగింది. దీంతో అప్రమత్తమైన తేజస్వీ తన ప్రసంగాన్ని ఆపేసి వెనక్కి జరిగారు. ఆ తర్వాత వెంటనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. భద్రతా సిబ్బంది ఈ డ్రోన్‌ను సీజ్‌ చేశారు. 

ఈ ఘటనపై పట్నా సెంట్రల్‌ ఎస్పీ దీక్ష స్పందించారు. ‘‘ఈ ఘటనను పరిశీలిస్తున్నాం. అది నిషేధిత ప్రాంతం.డ్రోన్లు...తదితర వస్తువులను ఎగరవేయకూడదు. ర్యాలీ జరుగుతున్న సమయంలో పోలీసు బృందం జనసమూహాన్ని నియంత్రించడంలో బిజీగా ఉంది. కానీ, ఈ విషయంపై కచ్చితంగా దర్యాప్తు చేస్తాం’’ అన్నారు. 


Tags :
Published : 29 Jun 2025 18:10 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని