Devendra Fadnavis: పాక్ నంబరు నుంచి మహారాష్ట్ర సీఎంకు బెదిరింపులు

ఇంటర్నెట్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis)కు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ బెదిరింపులు పాకిస్థాన్ ఫోన్ నంబరు నుంచి రావడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ముంబయి ట్రాఫిక్ పోలీసులకు వాట్సప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. అందులో సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ మెసేజ్ చేసిన వ్యక్తి పేరు మాలిక్ షాబాజ్ హుమయూన్ రాజాదేవ్‌గా పేర్కొన్నాడు. ఈ బెదిరింపుల నేపథ్యంలో సీఎం, ఆయన కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇక, ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde)కు సైతం బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెయిల్ చేశారు. దీనిపై దర్యాప్తు చేయగా.. అది బూటకమని అధికారులు తేల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 


