Piyush Goyal: దేశ ప్రయోజనాలను కాపాడతాం

Eenadu icon
By National News Desk Published : 01 Aug 2025 04:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ట్రంప్‌ సుంకాలపై పార్లమెంటులో కేంద్ర మంత్రి గోయల్‌ ప్రకటన

దిల్లీ: అమెరికా సుంకాల నేపథ్యంలో మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని, భారత్‌ ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంపై గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన వివరణ ఇచ్చారు. ‘దేశ ప్రయోజనాలు, చిన్న పరిశ్రమలు, రైతులు, వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ట్రంప్‌ సుంకాల ప్రకటనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. గత 11 సంవత్సరాలుగా మన ఎగుమతులు పెరిగాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో భారత్‌ పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది’ అని గోయల్‌ వెల్లడించారు. తాము ఇతర దేశాలతో ఇలాంటి వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ‘భారత్‌-అమెరికా పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం మార్చిలో చర్చలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు- నవంబరు నాటికి ఒప్పందం మొదటి దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని గోయల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని