Shambala Movie: ఆది సాయికుమార్‌ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌.. ‘శంబాల’

Eenadu icon
By Entertainment Team Updated : 23 Dec 2024 17:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌ (Aadi saikumar) మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల’ (shambala). అర్చన అయ్యర్ కథానాయిక. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆది పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చిత్ర బృందం చెబుతోంది. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారని తెలిపింది. ‘శంబాల’లో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని సరికొత్త పాయింట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Tags :
Published : 23 Dec 2024 17:07 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని