AlluArjun: అల్లు వారింట దీపావళి వేడుకలు.. మెగా ఫ్యామిలీ సందడి
దివ్వెల పండుగ దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు.. బంధుమిత్రుల కోసం తమ ఇంట ప్రత్యేకంగా పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వెలుగుల పండగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ బన్నీ సతీమణి స్నేహారెడ్డి బంధుమిత్రుల కోసం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో మెగా కుటుంబసభ్యులు పాల్గొని సందడి చేశారు. బన్నీ దంపతులు, చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక స్టైలిష్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫొటోని నిహారిక ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘‘ఫ్యామిలీ’’ క్యాప్షన్‌ను జత చేసింది. మరోవైపు, గ్రాండ్ పార్టీ ఇచ్చిన స్నేహారెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ పలువురు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక హాస్యనటుడు వైవా హర్ష నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో ఫరియా, స్వాతి, ప్రియాంక జుకల్కర్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సందీప్ కిషన్, శ్రీకాంత్, మధుశాలినీ సందడి చేశారు.
దీపావళి వేడుకల్లో డ్యాన్స్ చేస్తోన్న నిహారిక, సాయిధరమ్ తేజ్
స్నేహారెడ్డితో నటి, ప్రముఖ డ్యాన్సర్ సంధ్యారాజు
హర్ష ఇచ్చిన పార్టీలో పాల్గొన్న దర్శకుడు చందు మొండేటి, సాయిధరమ్ తేజ్, శ్రీకాంత్
కలర్‌ఫొటో దర్శకుడు సందీప్ రాజ్
నటీమణులు స్వాతి, మధు శాలినీ
వైవా హర్షతో స్వాతి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
పోరాటం కొనసాగిస్తాం.. రైల్వే ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు
-
Ts-top-news News
19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Crime News
Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్ ఉద్యోగి హత్య