Anjali: ఇప్పటికి నాలుగు సార్లు పెళ్లి చేశారు.. రూమర్స్‌పై స్పందించిన అంజలి

సోషల్ మీడియాలో తనకు తెలియకుండానే పెళ్లి చేస్తున్నారని నటి అంజలి అన్నారు. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్లో ఆమె మాట్లాడారు.

Published : 03 Apr 2024 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు హీరోయిన్ అంజలి (Anjali) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గీతాంజలి’. అది అందరినీ ఆకట్టుకోవడంతో ఈ మూవీ యూనిట్‌ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) అంటూ సీక్వెల్‌తో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 11న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీని ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. అందులో అంజలి మాట్లాడుతూ ఇటీవల తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌ గురించి స్పందించారు. అలాగే ఈ సీక్వెల్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

‘నేను చేయగలిగిన పాత్రల అవకాశాలు నాకు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. అలా వచ్చాయి కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు కూడా వరుస చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. దీని తర్వాత ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’ ఉంది. తర్వాత ‘గేమ్‌ ఛేంజర్‌’ వస్తుంది. నవీన్‌ పొలిశెట్టితో ఓ చిత్రం రానుంది. 50వ చిత్రం చేస్తున్నప్పుడే మరో 6 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. అవన్నీ దర్శక నిర్మాతలు నాకోసం రాసినవే. ‘గీతాంజలి’ నాకు ప్రత్యేకం. పదేళ్ల క్రితం నేను హీరోయిన్‌గా చేసిన మొదటి చిత్రమది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో యాక్షన్‌ సన్నివేశాలు కూడా చేశాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా.. అందులోని సీత పాత్ర నాకు  చాలా ఇష్టం’ అని చెప్పారు. 

ఇక సోషల్‌ మీడియలో తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై స్పందిస్తూ.. ‘నాకు తెలియకుండానే ఇప్పటికి నాలుగుసార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదోసారి చేస్తున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో దీని గురించి విన్నాను. నేను పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని విషమేమిటంటే నేను అవుట్‌ డోర్‌ షూటింగ్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఫేక్‌ న్యూస్‌. పెళ్లైతే చేసుకుంటా.. కానీ ఇప్పుడు కాదు. దానికి కొంచెం టైమ్‌ ఉంది’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని