Women's World Cup: అమ్మాయిలూ.. మీరు దేశం గర్వపడేలా చేశారు: టీమ్‌ఇండియాపై సినీ సెలబ్రిటీల ప్రశంసలు

Eenadu icon
By Entertainment Team Updated : 31 Oct 2025 12:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియాను చూసి దేశం గర్విస్తోందని అగ్ర దర్శకుడు రాజమౌళి అభినందనలు తెలిపారు. మహిళల వన్డే ప్రపంచకప్‌ (ICC Womens World Cup 2025)లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. సెమీస్‌లో కంగారూలను చిత్తు చేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.  దీంతో హర్మన్‌ప్రీత్‌ సేనపై సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశం గర్వించేలా చేశారంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • ‘‘అద్భుతమైన భారత మహిళా క్రికెట్‌ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఎంతో ధైర్యంతో చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ ఛేదించలేని స్కోరు మీరు ఛేదించి దేశం గర్వపడేలా చేశారు. ఫైనల్లో మరోసారి చరిత్ర సృష్టించండి’’ - రాజమౌళి (SS Rajamouli)
  • ‘‘టీమ్‌ఇండియా.. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. సెమీఫైనల్లో రికార్డు స్కోరును ఛేదించడం చిన్న విషయం కాదు. జెమీమా, హర్మన్‌ ప్రీత్‌, రిచా, దీప్తి అందరూ గొప్పగా ఆడారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ట్రోఫీని తీసుకురండి’’ - వెంకటేశ్‌ (Venkatesh)
  • ‘‘నిజంగా ఇది గొప్ప వార్త.. మనం ఫైనల్స్‌కు చేరాం. టీమ్‌ఇండియాకు అభినందనలు’’ - లావణ్య త్రిపాఠి
  • ‘‘కలలు కనండి.. మిమ్మల్ని మీరు నమ్మండి.. విజయాన్ని సాధించండి.. నిజమైన ఛాంపియన్లు ఎలా ఉంటారో మన మహిళలు ప్రపంచానికి చూపించారు. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ భారత్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది’’ - సోనూసూద్‌
  • ‘‘ఇవి భారత్‌కు గొప్ప క్షణాలు. ఉత్కంఠభరితమైన విజయంతో  మన మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది. దృఢ సంకల్పం, ఐక్యత, ప్రతిభ అన్నిటితో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. శుభాకాంక్షలు’’ - రిషబ్‌ శెట్టి
Tags :
Published : 31 Oct 2025 11:43 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు