- TRENDING
- T20 World Cup
- TG Muncipal Elections
Chinna Movie Review: రివ్యూ: చిన్నా.. సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా మెప్పించిందా?
Chinna Movie Review | చిత్రం: చిన్నా; నటీనటులు: సిద్ధార్థ్ నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ తదితరులు; సంగీతం: దిబు నైనన్ థామస్, విశాల్ చంద్రశేఖర్(నేపథ్య సంగీతం); ఎడిటింగ్: సురేష్ ఏ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: బాలాజీ సుబ్రహ్మణ్యం; నిర్మాత: సిద్ధార్థ్; రచన, దర్శకత్వం: ఎస్.యు.అరుణ్‌కుమార్; విడుదల: 06-10-2023

‘ఈ సినిమా నచ్చలేదంటే ఇకపై నేను ఇక్కడికి రాను, నా సినిమాల్ని తెలుగులో విడుదల చేయను’ అంటూ కథానాయకుడు సిద్ధార్థ్ ఇటీవల ‘చిన్నా’ వేడుకలో చెప్పడం పరిశ్రమలోనూ... ప్రేక్షకుల్లోనూ చర్చని లేవనెత్తింది. ఒకప్పుడు వరుస విజయాలతో సత్తా చాటిన సిద్ధార్థ్... కొన్నాళ్లుగా సరైన విజయాల్ని అందుకోలేకపోతున్నాడు. ఆయన ఏ భాషలో సినిమా చేసినా దాన్ని తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నారు. కానీ, గత చిత్రాల స్థాయిలో ఆదరణ పొందలేకపోతున్నాయి. ఈసారి ఆయన తమిళంలో చేసిన ‘చిత్తా’ని తెలుగులో ‘చిన్నా’ పేరుతో విడుదల చేశాడు. ఈ సినిమా వేడుకలో మాట్లాడుతూ సిద్ధార్థ్ సినిమాలు ఎవరు చూస్తారని కొంతమంది అన్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. (Chinna Movie Review in telugu) సిద్ధార్థ్ నటిస్తూ స్వయంగా నిర్మించిన ‘చిత్తా’ తమిళంలో విమర్శకుల మెప్పు పొందింది. మంచి సినిమా తీశానని... తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పిస్తుందంటూ నమ్మకంగా చెప్పారు సిద్ధార్థ్ . మరి సినిమా ఎలా కథేంటి? ఎలా ఉంది?
కథేంటంటే: ఈశ్వర్ అలియాస్ చిన్నా (సిద్ధార్థ్) మున్సిపాలిటీలో పనిచేసే ఓ చిరుద్యోగి. తన అన్నయ్య చనిపోవడంతో వదిన, అన్న కూతురు సుందరి అలియాస్ చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతల్ని తన భుజాన మోస్తూ జీవితం కొనసాగిస్తుంటాడు. అంతా సాఫీగా సాగిపోతున్న దశలో చిట్టి స్నేహితురాలైన మున్ని (సబియా తస్నీమ్) లైంగిక దాడికి గురవుతుంది. మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఆరోపణలు వస్తాయి. సాక్ష్యంగా ఓ వీడియో కూడా బయటికొస్తుంది. నమ్మశక్యం కాని ఆ సంఘటన తర్వాత ఏం జరిగింది?ఆ లైంగిక దాడికి పాల్పడింది చిన్నానేనా?ఇరు కుటుంబాలు ఈ షాక్ నుంచి తేరుకోకముందే చిన్నా అన్న కూతురు చిట్టి కూడా కనిపించకుండా పోతుంది. చిట్టి మాయం వెనక ఎవరున్నారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ఒక సున్నితమైన అంశానికి థ్రిల్లింగ్ నేపథ్యాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చిన్నారులపై లైంగిక దాడుల్లోని ఓ కోణాన్ని ఆవిష్కరిస్తూ అందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తుంది. చిన్నారుల సంరక్షణ విషయంలో మనం ఏమేం నేర్చుకోవాలో... వాళ్లకి సురక్షితమైన సమాజాన్ని సృష్టించడం ఎంత అత్యవసరమో ఈ సినిమా చెప్పకనే చెబుతుంది. మన ఇంటిదాకా వస్తే తప్ప కొన్ని విషయాలపై స్పందించం. కానీ, ఇలాంటి సంఘటన మన ఇంట్లోనే జరిగిందా.. జరిగే అవకాశం ఉంది కదా! అనే భావనకి గురిచేస్తూ ఆద్యంతం హృదయాల్ని బరువెక్కిస్తూ సాగుతుంది. (Chinna Movie Review in telugu) గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మొదలుకొని పిల్లలని సెల్‌ఫోన్‌కి దూరంగా ఉంచడం, వారిని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండటం ఎంత అవసరమో ఈ సినిమా చెబుతుంది. ఈశ్వర్, అతని ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా కథలో ప్రేక్షకుల్ని లీనం చేశాడు దర్శకుడు. చిట్టి, మున్నీ కలిసి ఆటో ఎక్కాక కథలో వేగం పుంజుకుంటుంది. ఈశ్వర్‌పై లైంగిక దాడి ఆరోపణ రావడం సినిమాలో ఓ పెద్ద మలుపు. ఆ నేపథ్యంలో సంఘర్షణ కొనసాగుతుండగానే చిట్టి మాయం అవుతుంది. అక్కడ్నుంచి కథలో మరింత థ్రిల్ మొదలవుతుంది.
ప్రథమార్ధం సన్నివేశాలు, ఆ నేర నేపథ్యం ‘గార్గి’, ‘లవ్‌స్టోరి’ తరహా సినిమాల్ని గుర్తు చేస్తుంది. ద్వితీయార్ధంలో కేసు పరిశోధన, నిందితుడిని వెంటాడే సన్నివేశాలు ప్రేక్షకుడికి థ్రిల్‌ని పంచుతాయి. కానీ, చిన్నారులపై జరిగే దాడుల కోణం ఒకవైపు మనసుల్ని కదిలిస్తూనే ఉంటుంది. ఒకవైపు ఈ కథని నడుపుతూనే మరోవైపు చిన్నారులు, మహిళల విషయంలో జరుగుతున్న హింసని ఎత్తి చూపాడు దర్శకుడు. (Chinna Movie Review) ‘చిన్నా చేయి వేసినా అమ్మకి చెప్పాలి’ అని చిట్టికి తన తల్లి చెబుతున్నప్పుడు సిద్ధార్థ్ పలికించిన హావభావాలు, ద్వితీయార్ధంలో కథానాయిక శక్తి పాత్ర తన మామ చేతిలో లైంగిక దాడికి గురైన విషయం చెప్పినప్పుడూ, ఇలాంటి సంఘటనల నుంచి బాధితుల్ని బయటికి తీసుకు రావడం ఎంత ముఖ్యమో అని చెప్పే సన్నివేశాలు సినిమాకి కీలకం. నిజాయతీగా చేసిన ఓ మంచి ప్రయత్నం ఈ చిత్రం. వాణిజ్యాంశాల జోలికి వెళ్లకుండా కథనే నమ్మి కొన్ని జీవితాల్ని, కొన్ని సంఘటనల్ని సజీవంగా తెరపై ఆవిష్కరించారు.
ఎవరెలా చేశారంటే: సిద్ధార్థ్ తన నటనతో ఈశ్వర్ పాత్రకి ప్రాణం పోశాడు. లవర్‌బాయ్ తరహా పాత్రలు చేసి మెప్పించిన ఆయన ఇందులో పూర్తి భిన్నంగా, ఓ సహజమైన పాత్రలో కనిపించారు. ఆయన పాత్ర నేపథ్యంలో పండిన భావోద్వేగాలు సినిమాకి కీలకం. ఈశ్వర్ వదిన పాత్రలో అంజలి నాయర్ కనిపిస్తారు. చిన్నారులు సబియా, సహస్ర శ్రీ నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో సహస్ర నటన చాలా బాగుంటుంది. (Chinna Movie Review in telugu) కథానాయిక నిమిషా సజయన్ పాత్ర కూడా అత్యంత సహజంగా తెరపై కనిపిస్తుంది. పారిశుధ్య కార్మికురాలిగా కనిపించే ఆమె, ద్వితీయార్ధంలో తన నటనతో కట్టిపడేశారు. ఇతర నటులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం మరింత ప్రభావం చూపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. దర్శకుడు కథ, కథనాల్ని అత్యంత సహజంగా నడిపించిన తీరు సినిమాకి ప్రధాన ఆకర్షణ. మనసుల్ని కొంతకాలంపాటు వెంటాడే అంశాన్ని తెరపై స్పృశించారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + కథ, కథనం
- + సిద్ధార్థ్ నటన
- + సంగీతం
- బలహీనతలు
- - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
- చివరిగా: చిన్నా.. ఆలోచన రేకెత్తిస్తాడు.. అలరిస్తాడు!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

రివ్యూ: హనీ.. మరో క్షుద్ర నేపథ్యంతో వచ్చిన నవీన్ చంద్ర థ్రిల్లర్ మెప్పించిందా?
నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? -

రివ్యూ: శ్రీ చిదంబరంగారు.. వైవిధ్య కథాంశంతో వచ్చిన మూవీ మెప్పించిందా?
ఫిబ్రవరిలో బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల జోరు కనిపిస్తోంది. అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘శ్రీ చిదంబరంగారు’. -

రివ్యూ: యుఫోరియా.. గుణశేఖర్‌కు విజయాన్ని అందించిందా?
ఈసారి విజయమే లక్ష్యంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ తీసిన చిత్రం ‘యుఫోరియా’. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?Euphoria Movie Review -

రివ్యూ: సర్వం మాయ.. మలయాళంలో రూ.140కోట్లు వసూలు.. మూవీ ఎలా ఉంది?
సింపుల్ కథకు హృద్యమైన సన్నివేశాలు జోడించి సినిమాను తీర్చిదిద్దుతుంటారు మలయాళ దర్శకులు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’. -

రివ్యూ: గాంధీ టాక్స్.. మూకీ సినిమా ఎలా ఉంది?
‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ ఆకర్శించారు దర్శకుడు కిశోర్. ఈ చిత్ర కథేంటి? మాటల్లేని ఈ సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? -

రివ్యూ: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా మెప్పించిందా?
‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో విజయవంతమైన ‘జయ జయ జయ జయహే’కి రీమేక్ ఇది. మరి మాతృకతో పోలిస్తే ఇందులో కనిపించే కొత్త అంశం ఏంటి? ఎలాంటి వినోదాన్ని ఇచ్చింది? -

‘సిరై’.. రూ.3కోట్లతో తీస్తే రూ.30 కోట్లు వసూలు చేసిన క్రైమ్ డ్రామా ఎలా ఉంది?
తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటుడు విక్రమ్ ప్రభు. వైవిధ్యమైన కథలతో అలరించే ఆయన నటించిన 25వ చిత్రం ‘సిరై’. -

రివ్యూ: ‘బోర్డర్2’.. దేశభక్తి నేపథ్యం మరోసారి మెప్పించిందా?
బాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రాల్లో ‘బోర్డర్’కి ప్రత్యేక స్థానముంది. ఇప్పుడు 28ఏళ్ల తర్వాత ‘బోర్డర్ 2’ను తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు అనురాగ్ సింగ్. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకుల్ని అలరించిందా? -

రివ్యూ: చీకటిలో.. శోభిత ధూళిపాళ్ల క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ‘చీకటిలో..’ ఎలా ఉంది?ఎలాంటి థ్రిల్ పంచింది? -

రివ్యూ: తస్కరీ.. ఇమ్రాన్ హష్మీ వెబ్‌సిరీస్ థ్రిల్ పంచిందా?
ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘తస్కరీ’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే? -

రివ్యూ: కలాంకావల్.. సైకో కిల్లర్‌గా మమ్ముట్టి.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘కలాంకావల్’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? -

రివ్యూ: నారీ నారీ నడుమ మురారి.. శర్వానంద్ మూవీ ఎలా ఉందంటే?
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదలైంది. -

రివ్యూ: అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి ఎంటర్టైనర్ ఎలా ఉంది?
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో మారి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైన్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? -

రివ్యూ: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా?
రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? -

రివ్యూ: మన శంకరవరప్రసాద్‌గారు.. చిరు-అనిల్ కాంబో మెప్పించిందా?
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? -

వెబ్‌సిరీస్ రివ్యూ: కానిస్టేబుల్ కనకం: సీజన్-2.. చంద్రిక బతికే ఉందా?
వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చూపించారు. మరి ఇప్పుడు వచ్చిన సీజన్2 ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది. -

రివ్యూ: ‘ది రాజాసాబ్’.. ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ ఎలా ఉంది?
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది. -

రివ్యూ: రూ.5 కోట్లతో తీస్తే.. రూ.50 కోట్లు వసూలు చేసిన ‘ఎకో’ ఎలా ఉంది?
మలయాళంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘ఎకో’ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంది? -

రివ్యూ: ఇక్కీస్.. బాలీవుడ్ వార్ యాక్షన్ డ్రామా ఎలా ఉంది?
గతేడాది బాలీవుడ్లో హిట్లు తక్కువే అయినా.. వసూళ్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టించాయి. కొత్త ఏడాది ‘ఇక్కీస్’తో హిందీ సినిమా మొదలైంది. మరి మూవీ కథేంటి? ఎలాఉంది? -

రివ్యూ: ‘వనవీర’.. పురాణాల టచ్.. గ్రామీణ నేపథ్యం.. సినిమా ఎలా ఉంది?
అవినాశ్ తిరువీధుల హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘వనవీర’. జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది?











