Chiranjeevi: వరుణ్‌-లావణ్య పెళ్లిలో మనవరాలితో చిరు దంపతులు.. ఫొటో వైరల్‌

వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఇటలీలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా, అల్లు కుటుంబాలు సందడి చేశాయి. ఇక ఈ పెళ్లిలో మనవరాలిని ముద్దు చేస్తున్న చిరంజీవి దంపతుల ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.   

Published : 02 Nov 2023 01:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించి వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి(VarunTej Lavanya Tripathi Marriage) జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు, తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వేడుకగా వీరి(VarunLav) వివాహం జరిగింది. క్రీమ్‌ గోల్డ్‌ షేర్వాణిలో వరుణ్‌ తేజ్‌, కాంచీపురం చీరలో లావణ్య త్రిపాఠి జంట మెరిసిపోయింది. ఈ పెళ్లిలో మెగా, అల్లు కుటుంబాల సందడి మామూలుగా లేదు. పెళ్లి వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, వైష్ణవ్‌ తేజ్‌, హీరో నితిన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.   

ఇక ఈ పెళ్లిలో చిరంజీవి(Chiranjeevi) దంపతుల ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో రామ్‌చరణ్-ఉపాసన(Ramcharan-Upasana)ల గారాల పట్టి క్లీంకార(Klinkaara)ను ఎత్తుకొని తాతయ్య, నానమ్మలు అయిన చిరంజీవి, సురేఖ దంపతులు ఆనందపడిపోతూ కనిపించారు. సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోతున్న చిరంజీవి దంపతులు మనవరాలిని ఒళ్లో కూర్చొబెట్టుకుని ఆడిస్తుండటం ముద్దుగొలుపుతోంది. నూతన వధూవరులైన వరుణ్‌-లావణ్యకు ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరి రిసెప్షన్‌ ఈ నెల 5న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని