Chiranjeevi: డీప్‌ ఫేక్‌, సైబర్‌ నేరాలకు ఎవరూ భయపడొద్దు: చిరంజీవి

Eenadu icon
By Entertainment Team Updated : 31 Oct 2025 13:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్:  టెక్నాలజీని మంచి కోసం వాడుకోవాలని చిరంజీవి అన్నారు. తెలంగాణ పోలీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా దివస్‌ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. దేశాన్ని ఏకం చేసి మనకందించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పోలీస్‌ వ్యవస్థ చాలా బలంగా ఉందని కొనియాడారు. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని అందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) తెలిపారు. అలాగే ప్రజలకు, సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన డీప్‌ ఫేక్‌, సైబర్‌ నేరాలపై చిరంజీవి స్పందించారు.

‘‘డీప్‌ ఫేక్‌ అంశాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. డీజీపీ, సీపీ సజ్జనార్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎవరూ డీప్‌ ఫేక్‌, సైబర్‌ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై ఒక చట్టం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. కచ్చితంగా అది జరగాలని కోరుకుంటున్నా. వీటి నుంచి సామాన్యులకు కూడా రక్షణ కలిగిస్తారు. పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సామాన్యులు కూడా ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు’’ అని చిరంజీవి అన్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. 

ఇక రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నగర ప్రజలకు సేవ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. అందరం కలిసిమెలిసి ఏక్తా దివస్‌ స్ఫూర్తిని చాటాలని సీపీ పిలుపునిచ్చారు.


Tags :
Published : 31 Oct 2025 10:22 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు