Ek Mini Katha Review: రివ్యూ: ఏక్ మినీ కథ
‘ఏక్ మినీ కథ’ సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: ఏక్ మినీ కథ; నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధదాస్, సప్తగిరి, బ్రహ్మాజీ, సుదర్శన్, పోసాని కృష్ణమురళి; సంగీతం: ప్రవీణ్ లక్కరాజు; ఎడిటింగ్: జి.సత్య; సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి; రచన, స్క్రీన్‌ప్లే: మేర్లపాక గాంధీ; దర్శకత్వం: కార్తీక్ రాపోలు; విడుదల: అమెజాన్ ప్రైమ్
కరోనా సెకండ్‌వేవ్‌తో థియేటర్లు మళ్లీ మూతపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గతేడాది మాదిరిగానే పలు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అలా థియేటర్లో ప్రేక్షకులను అలరించాల్సిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఒక విభిన్నమైన సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. మరి ‘ఏక్ మినీ కథ’ ఏంటి? కథ చిన్నదా? పెద్దదా?
కథేంటంటే: సంతోష్ శోభన్(సంతోష్)కు చిన్నప్పటి నుంచి ఒక అనుమానం మదిని తొలిచేస్తుంది. తన జననాంగం చిన్నదని అతడి భావన. దీంతో మెరిట్ స్టూడెంట్ అయిన సంతోష్ సరిగా చదవలేక ఆ ఆలోచనలతో చదువులో వెనుకబడిపోతాడు. ఎలాగో ఇంజినీరింగ్ పూర్తి చేసి, కనస్ట్రక్షన్ కంపెనీలో చేరతాడు. అయినా కూడా అతను అదే ఆలోచనలతో సతమతమవుతూ తెలిసిన చిట్కాలన్నీ పాటిస్తుంటాడు. ఒకానొక సమయంలో ప్రాణహాని ఉందని తెలిసినా సర్జరీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కొడుకు వింత ప్రవర్తనతో విసిగిపోయిన రామ్మోహన్(బ్రహ్మాజీ) అతడికి పెళ్లి సంబంధం చూస్తాడు. దీంతో సంతోష్, అమృత(కావ్య)లకు వివాహం అవుతుంది. పెళ్లి తర్వాత తన సమస్య బయటపడకూడదన్న సంతోష్ ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ‘నాన్నా పిల్లలు ఎలా పుడతారు’ అని చిన్నప్పుడు అడిగితే ‘వేలెడంత లేవు. నీకెందుకురా ఆ ప్రశ్నలు’ అని చాలా మంది తల్లిదండ్రులు తిడతారు. ఇలా పిల్లలు అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తిట్టో.. కొట్టో.. వారిని భయపెడుతుంటారు. దీంతో వారు ఎదుగుతున్న సమయంలో వచ్చే అనుమానాలు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి వారిలోనే వారు మథనపడిపోతుంటారు. ఆత్మన్యూనతతో కుంగిపోతుంటారు. యుక్త వయసు వచ్చిన వారిలో చాలా మందికి వచ్చే ఒక ప్రశ్ననే పాయింట్‌గా తీసుకుని, కథను సిద్ధం చేశారు యువ దర్శకుడు మేర్లపాక గాంధీ. దానికి హాస్యం జోడిస్తూ దర్శకుడు కార్తీక్ రాపోలు ‘ఏక్ మినీ కథ’ను చక్కగా తీర్చిదిద్దాడు. మొదటి పది నిమిషాల్లోనే కథానాయకుడి ద్వారా నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆ విషయం ఎవరికీ చెప్పలేక సంతోష్ పడే వేదన.. అభద్రతా భావం దాన్ని అధిగమించేందుకు పాటించే చిట్కాలు, సర్జరీ కోసం వైద్యుడి దగ్గరకు వెళ్లడం ఇలా వరుస సన్నివేశాలతో కథ సాగిపోతుంటుంది. సంతోష్ పడే ఇబ్బంది నుంచి హాస్యం పుట్టేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకున్నారు. దీంతో ప్రథమార్ధమంతా నవ్వులతో సాగిపోతుంది. ముఖ్యంగా సంతోష్, అతడి స్నేహితుడు సుదర్శన్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి. అమృతతో అనుకోకుండా పెళ్లి జరగడంతో కథ మలుపు తిరుగుతుంది.
పెళ్లి తర్వాత కథానాయకుడికి కొత్త సమస్య వచ్చి పడుతుంది. శోభనాన్ని తప్పించుకునేందుకు అతడు చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తాయి. సంతోష్ ఇంట్లో సప్తగిరి అండ్ కో చేసే హంగామా కాస్త అతిగా అనిపిస్తుంది. ఇక్కడే పలు సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. అయితే, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న వాటిని ఎంచుకుని నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సోనూసూద్, రాకేశ్ మాస్టర్, పూజాహెగ్డే కాళ్లు, ప్రేమికులకు పార్కుల్లో పెళ్లి చేయడం ఇలా ఒక్కో సన్నివేశంలో ఒక్కో విషయాన్ని ప్రస్తావించాడు. పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా తీర్చిదిద్దాడు. చివరిలో నాయక-నాయికల మధ్య వచ్చే సన్నివేశాలు రొటీన్‌గానే ఉన్నా అంతకుమించి ముగింపు ఆశించలేం. పిల్లలకు వచ్చే అనుమానాలను ప్రేమతో నివృత్తి చేయాలి తప్ప వాళ్లని భయపెట్టకూడదని సైకియాట్రిస్ట్ హర్షవర్థన్ ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే: యువ కథానాయకుడు సంతోష్ శోభన్, కావ్య థాపర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఆత్మన్యూనత కలిగిన యువకుడిగా సంతోష్ నటన మెప్పిస్తుంది. సినిమాలో ఎవరు.. ఏ విషయం గురించి మాట్లాడినా, తన సమస్య గురించి చెబుతున్నారన్న భావనతో మథనపడే యువకుడి పాత్రలో చక్కగా సరిపోయారు. ఇలాంటి కథ, పాత్రలు, బాలీవుడ్లో వస్తుంటాయి. ‘విక్కీ డోనర్’, ‘బాలా’ వంటివి ఇలాంటి కథలతో వచ్చినవే. ఈ తరహా కథలు ఎంచుకోవడానికి పెద్ద హీరోలెవరూ ముందుకురారు. కానీ, యువ కథానాయకుడు సంతోష్ ధైర్యంగా చేశాడు. ప్రతి సన్నివేశంలోనూ అతని హావభావాలతో మెప్పించాడు. బ్రహ్మాజీ, సుదర్శన్, పోసాని, సప్తగిరి నవ్వులు పంచారు. శ్రద్ధాదాస్ స్వామిజీగా ద్వితీయార్ధంలో కనిపిస్తుంది. తన పాత్ర పరిధి మేరకు నటించింది.
సాంకేతికంగా సినిమా ఓకే. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. రచయిత మేర్లపాక గాంధీ ఎంచుకున్న పాయింట్ చాలా సున్నితమైంది. సాధారణంగా చర్చించడానికి కూడా కాస్త ఇబ్బంది పడే ఈ పాయింట్‌ను తీసుకుని రెండు గంటలు నడపటం మామూలు విషయం కాదు. దాన్ని అంతే సున్నితంగా దర్శకుడు కార్తీక్ తీర్చిదిద్దాడు. కథ అంతా కథానాయకుడి సమస్య చుట్టూనే సాగుతున్నా, అసభ్యతకు తావులేకుండా హాస్యం పాళ్లు ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. ద్వితీయార్ధంలో కథాగమనం నెమ్మదిగా సాగుతుంది. పాటలు కథాగమనానికి కాస్త బ్రేకులు వేస్తాయి. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీర్చిదిద్దారు. కుటుంబంతో కలిసి చూడటం కాస్త ఇబ్బందికరమే. ఎలాగూ ఓటీటీలో విడుదలైంది కాబట్టి, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని యువత చక్కగా ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. తప్పకుండా నవ్వులు పంచుతుంది.
బలాలు | బలహీనతలు |
+ హాస్యం | - ద్వితీయార్ధంలో నెమ్మదిగా సాగే కథనం |
+ నటీనటులు | |
+ ప్రథమార్ధం |
చివరిగా: ‘ఏక్ మినీ కథ’.. తాను బాధపడుతూ మనల్ని కడుపుబ్బా నవ్వించే యువకుడి కథ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్