Geethanjali 2: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. రూ.50 కోట్లు వసూలు చేస్తుంది: కోన వెంకట్‌

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాకు మంచి స్పందన వచ్చిందని నిర్మాత కోన వెంకట్‌ అన్నారు. రూ.50 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Published : 12 Apr 2024 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీని సక్సెస్ మీట్‌ తిరుపతిలో జరిగింది. ఈసందర్భంగా మీడియాతో నిర్మాత కోన వెంకట్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

‘‘గీతాంజలి మొదటి భాగానికి మంచి స్పందన వచ్చింది. అది ట్రెండ్‌ సెట్‌ చేసింది. రెండోభాగం దానికి మించిన విజయం సొంతం చేసుకుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో ఒడుదొడుకులు చూశాను. హిట్స్‌.. ఫ్లాప్స్‌ చూశా. విజయం అనేది ఎంత ముఖ్యమో ఈ సినిమాతో మొదటిసారి తెలిసొచ్చింది. సక్సెస్‌ మనకు బలాన్నిస్తుంది. కొత్త దర్శకులకు ఎంతో ఉపయోగపడుతుంది. నిర్మాతలకు కూడా ఉత్సాహాన్నిస్తుంది. కొత్త స్టోరీలను ప్రేక్షకులకు చెప్పడానికి శక్తినిస్తుంది. ఈ సినిమా అంజలికి ఎంతో ప్రత్యేకం. తన 50వ సినిమా. అందుకే రూ.50కోట్లు వసూలు చేయాలని దేవుడిని కోరుకున్నా. థియేటర్లలో హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో పెద్ద నంబర్లనే చూస్తాం. దేవుడి దయతో రూ.50 కోట్లు వస్తాయన్న నమ్మకముంది. ఈ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారు. త్వరలోనే మీ అందరినీ రూ.50 కోట్ల సెలబ్రేషన్స్‌లో కలుస్తాం’ అని చెప్పారు.

అంజలి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నాకెంతో ప్రత్యేకం. నేను నటించే 50వ సినిమా ఆడియన్స్‌కు నచ్చాలని మొదటినుంచి కోరుకున్నా. ఈరోజు అదే జరిగింది. గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఆడియన్స్‌కు మళ్లీ నచ్చింది’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని