సంక్షిప్త వార్తలు (5)
రహస్యాల ప్రపంచం ‘బారాముల్లా’

వరుసగా పిల్లల అదృశ్యాల కేసులు.. ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగిన ఓ పోలీసు అధికారి.. మరి ఈ కేసుకు అతీంద్రియ శక్తులు తోడైతే ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధమైంది ‘బారాముల్లా’ చిత్రం. ‘ఆర్టికల్ 370’ దర్శకనిర్మాత ఆదిత్య ధర్ నిర్మిస్తున్న సినిమా ఇది. మానవ్ కౌల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌కు ఆదిత్య జంభాలే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఈ కిడ్నాప్ కచ్చితంగా డబ్బు కోసం జరగలేదు.. కానీ దీనికి కారణం ఏంటో అర్థం కావడం లేదు’, ‘ఇదొక రహస్యాల ప్రపంచం’’ లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోందీ ట్రైలర్. ఇందులో డీఎస్పీ రిద్వాన్ సయ్యద్ పాత్రలో కనిపించనున్నారు మానవ్. వచ్చే నెల 7న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుందీ చిత్రం.
మోహన్‌లాల్ కుమార్తె తొలి చిత్రం ప్రారంభం

మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ కుమార్తె విస్మయ వెండితెరకు పరిచయం కానున్న చిత్రం ‘తుడక్కమ్’. జుడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విస్మయతో పాటు ఆంటోని కుమారుడు ఆశిష్ జో ఆంటోని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ‘‘నేను నటుడిని కావాలని ఎప్పుడు అనుకోలేదు. అది విధి ప్రకారం జరిగిపోయింది. ఇప్పుడు నా కూతురు సినిమాల్లో నటించాలని కోరుకుంది. దానిని సాధ్యం చేయడానికి మాకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ.. నటన ఎప్పుడూ అంత సులభం కాదు. సినిమా ఎప్పుడూ వన్ మ్యాన్ షో కాదు. మంచి వేదిక, కథలు, సహచరులు అవసరం. ఆ విషయంలో మాయ అదృష్టవంతురాలిగా ఉండాలని కోరుకుంటున్నాన’’ని తెలిపారు.
సృష్టి.. ప్రళయం.. మహాకాళి

భారతీయ పౌరాణిక సూపర్ హీరో సినిమాటిక్ ప్రపంచాన్ని మరో మెట్టు ఎక్కించే చిత్రంగా ‘మహాకాళి’ నిలుస్తుందని చెప్పారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన కాన్సెప్ట్‌తో, పూజ కొల్లూరు తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘మహాకాళి’. ఆర్‌ఏకే దుగ్గల్, రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న భూమిశెట్టి లుక్‌ని గురువారం పరిచయం చేసింది చిత్రబృందం. ఆగ్రహం - కరుణ, సృష్టి - ప్రళయం, విధ్వంసం - పునర్జన్మ.. ఇలా అన్నీ తనలోనే ఉన్నాయని చాటి చెప్పే పాత్రలో భూమిశెట్టి నటిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి.
షరతులు లేని ప్రేమంటే!

‘పార్కులకూ.. సినిమాలకూ తిరగడమే ప్రేమ కాదు. నాలా మరిచిపోకుండా బతకడమే ప్రేమంటే...’ అంటున్నాడు ఓ యువకుడు. ఆ కథేంటో తెలియాలంటే ‘ప్రేమిస్తున్నా’ చిత్రం చూడాల్సిందే. సాత్విక్‌వర్మ, ప్రీతి నేహా జంటగా నటించిన చిత్రమిది. భాను దర్శకత్వం వహించారు. కనక దుర్గారావు పప్పుల నిర్మాత. వరలక్ష్మి పప్పుల సమర్పకులు. ఈ చిత్రం నవంబరు 7న రానుంది. ఈ సందర్భంగా గురువారం యువ దర్శకుడు వెంకీ అట్లూరి ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు భాను మాట్లాడుతూ ‘‘షరతులు లేని ప్రేమ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు.
అలా చేయడం సరైంది కాదు
‘రామాయణ్’లో రాముడిగా రణ్‌బీర్ నటించడంపై విమర్శలు
స్పందించిన ఆధ్యాత్మిక గురువు సద్గురు 
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్‌ని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో చేసిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దాంతో దీనిపై సద్గురు మాట్లాడుతూ.. ‘‘అలా ట్రోల్ చేయడం సరికాదు. గతంలో రణ్‌బీర్ అలాంటి పాత్రలు చేశాడని ఇప్పుడు ఇలాంటి పాత్ర చేయడానికి వీల్లేదనడం కరెక్ట్ కాదు. అతనికి భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని తెలియదు కదా. రేపు వేరొక సినిమాలో రావణుడిగా నటిస్తే.. అప్పుడూ ట్రోల్స్ చేస్తారా? అలా చేయడం సరైన పద్ధతి కాదు. ఒక సినిమాలో రాముడిలా నటించాలంటే కేవలం నటనే కాదు, దైవంలోని కొన్ని అంశాలు నటుడిలోనూ మార్పులు తీసుకొస్తాయని నేను నమ్ముతాను. అతనికి ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. కానీ ఇప్పుడు సినిమాలు నటులు, దర్శకులతో కాదు ప్రేక్షకుల వల్ల విజయవంతమవుతున్నాయి. కాబట్టి వారి అంచనాలను పూర్తిగా తోసిపుచ్చలేము. ఈ విషయంలో భక్తి, నటనని సమతుల్యం చేసేలా ఉండాల’’ని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన తీసుకునే పారితోషికాన్ని క్యాన్సర్ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళి, రెండో పార్ట్ 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆస్కార్‌లో లాబీయింగ్‌కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్‌కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్‌కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్‌బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 - 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 


