హాలీవుడ్‌ టు హైదరాబాద్‌ కాన్సెప్ట్‌తో సినిమాటికా ఎక్స్‌ పో 2025

Eenadu icon
By Cinema Desk Published : 31 Oct 2025 01:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘‘ఎప్పటికప్పుడు మారుతున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటే సినిమా ప్రపంచంలో అద్భుతాలు చేయొచ్చ’’ని అన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.జి.విందా. ఫిల్మ్‌ మేకింగ్‌ అనేది కొందరికే పరిమితం కాకుండా ఆసక్తి ఉన్నవారందరికీ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ పంథాలోనే గ్రామాల్లో ఉన్న క్రియేటర్ల కోసం ‘సినిమాటికా ఎక్స్‌పో 2025’ అద్భుతమైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. భారతీయ సినిమాని గ్లోబల్‌ వేదికపై నిలబెట్టాలన్న దృక్పథంతో.. తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో.. సినిక క్రియేటర్స్‌ కౌన్సిల్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ‘సినిమాటికా ఎక్స్‌పో’ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమాన్ని నవంబరు 1-2 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమాటికా ఎక్స్‌పో మేనేజింగ్‌ డైరెక్టర్, ఛాయాగ్రాహకుడు పి.జి.విందా మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు ‘హాలీవుడ్‌ టు హైదరాబాద్‌’ కాన్సెప్ట్‌తో భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే కొత్త మైలురాయిగా ఈ ఎడిషన్‌ నిలుస్తుంది’’ అన్నారు. ‘‘సినీ పరిశ్రమలోని అన్ని అసోసియేషన్‌ సభ్యులకు, ఇండస్ట్రీలో పని చేసే వారికి ఇందులో ప్రవేశం ఉచితం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పంజా శ్రవణ్‌. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు