సంక్షిప్త వార్తలు (4)
కన్నునొదిలి కనుపాప ఉంటుందా...!

అల్లరి నరేశ్ కథానాయకుడిగా... నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. కామాక్షి భాస్కర్ల కథా నాయిక. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పకులు. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాల ఫేమ్ డా.అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. ‘కన్నొదిలి... కలనొదిలి కనుపాపే ఉంటుందా...’ పాట విడుదలతో శుక్రవారం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటకి, దేవ్ పవార్ సాహిత్యం అందించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆలపించారు. నాయకానాయికల మధ్య మంచి కెమిస్ట్రీ, అద్భుతమైన విజువల్స్‌తో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ‘‘ప్రేమ, థ్రిల్లింగ్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంది. టీజర్‌తోనే ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పంచుతుందనే అంచనాల్ని పెంచిన ఈ చిత్రం నవంబరు 21న ప్రేక్షకుల ముందుకొస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కుశేందర్ రమేశ్‌రెడ్డి.
వంద శాతం వినోదం పంచుతాం

యువతరం ప్రేక్షకులు తమతోపాటు తల్లిదండ్రుల్ని థియేటర్‌కి తీసుకెళ్లి చూపించాలనుకునే సినిమా ఇదని చెప్పారు ఆర్.పి.పట్నాయక్. ఆయన స్వర కల్పనలో త్రినాథ్ కటారి కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాహితీ అవంచ కథానాయిక. సంజీవని ప్రొడక్షన్స్ పతాకంపై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా త్రినాథ్ కటారి మాట్లాడుతూ ‘‘ఇదొక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుళ్ల కథ, అమ్మాయి అబ్బాయి కథ. సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్‌కి కథ చెబుతున్నప్పుడే ఒక హిట్ సినిమా చేయబోతున్నాం అన్నారు. ఆయన చెప్పిన ఆ మాట ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ప్రేక్షకులకు వంద శాతం వినోదం పంచబోతున్నాం’’ అన్నారు. సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ ‘‘నాకు బాపు సినిమాకి పనిచేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందనే అభిప్రాయం కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించడంతో సినిమా స్థాయి పెరిగింది’’ అన్నారు.
‘నేను రెడీ’కి మిక్కీ స్వరాలు

హవీశ్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘నేను రెడీ’. నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ కథానాయిక. శ్రీలక్ష్మి, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘ప్రస్తుతం చిత్రీకరణతో పాటు సంగీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: నిజార్ షఫీ.
థ్రిల్ చేసే సందిగ్ధం

నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో పార్థ సారథి కొమ్మోజు తెరకెక్కించిన చిత్రం ‘సందిగ్ధం’. సంధ్య తిరువీధుల నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. భార్యాభర్తలైన సంధ్య, పార్థు కష్టపడి తీసిన ఈ సినిమా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇదొక విభిన్నమైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తూ సాగుతుంది’’ అన్నారు దర్శకుడు పార్థ సారథి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆస్కార్‌లో లాబీయింగ్‌కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్‌కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్‌కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్‌బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 - 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 - 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 


