హీరోలను మితిమీరి ఆరాధించడం సరైంది కాదు

Eenadu icon
By Cinema Desk Published : 02 Nov 2025 02:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రం తర్వాత అగ్ర కథానాయకుడు అజిత్‌ కుమార్‌ తదుపరి చిత్రంలో భాగంగా మరోసారి దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌తో కలిసి పనిచేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ..‘‘ఈ ప్రాజెక్ట్‌ చిత్రీకరణను రెండు నెలల్లో ప్రారంభించనున్నారు. చిత్రబృందం వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనని విడుదల చేస్తుంద’’ని తెలిపారు. అలానే ఆయన ఇటీవల తమిళనాడులో చోటుచేసుకున్న కరూర్‌ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. దీనికి విజయ్‌ మాత్రమే కాదు.. అందరూ బాధ్యులేనన్నారు. ‘‘సమాజం సమష్టి బాధ్యతతో ఆలోచించాలి. ఎవరినీ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ మధ్య భారీ సమావేశాల సామాజిక ధోరణి ఎక్కువయింది. ఇది ఆందోళనగా మారింది. దీనికి మనందరం కూడా బాధ్యులమే. అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తపరిచే విధానం కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తోంది. మితిమీరిన హీరో ఆరాధన సమాజంలో, ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నాయి. దీనివల్ల నటులు నిజజీవితంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో చిత్రపరిశ్రమకి చెడ్డ పేరు వస్తుంది’’అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు