- TRENDING
- T20 World Cup
- TG Muncipal Elections
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’?

పెళ్లిచూపులు... గీత గోవిందం తదితర సినిమాలతో కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). వచ్చే సంక్రాంతికి ఆయన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)గా సందడి చేసే అవకాశాలున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఇటీవలే ఓ చిత్రం మొదలైంది. మృణాల్ ఠాకూర్ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘ఫ్యామిలీ స్టార్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ - పరశురామ్ కలిసి చేస్తున్న చిత్రమిది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చిత్రీకరణ షురూ
కొత్త సినిమాల విషయంలో విజయ్ జోరు పెంచారు. ఒకవైపు ‘ఖుషి’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన, కొత్తగా రెండు చిత్రాల కోసం రంగంలోకి దిగారు. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఓ గూఢచారిగా కనిపించనున్నారు. శ్రీలీల కథానాయిక. శుక్రవారం చిత్రీకరణ మొదలైంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ వచ్చే నెల నుంచి మొదలు కానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్.. అలరిస్తున్న ప్రమోషనల్ వీడియో
నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు. -

అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ : ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత
‘కపుల్ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్ మొగిలినేని తెలిపారు. -

వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
వాలెంటైన్స్ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి. -

2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఆసక్తికర పోస్టు
తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ప్రకటించింది. -

ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్
తాను డైరెక్ట్ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -

పవర్ఫుల్ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ.. ‘జీపీఎస్’ అంటే ఇదే
తరుణ్ భాస్కర్ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. -

రామ్‌చరణ్ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే
రామ్‌చరణ్ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది. -

పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల తేదీ ఖరారైంది. -

‘డెకాయిట్’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
అడివి శేష్ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్’ మరోసారి వాయిదా పడింది -

‘వారణాసి’కి ‘అవతార్’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే!
‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు. -

వేసవిలో ‘బైకర్’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘బైకర్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. -

ధనుష్- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్ డైరెక్టర్‌తో
ధనుష్, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు. -

ఈ వారం థియేటర్లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే!
2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి. -

94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్
వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్ అడ్రస్.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి. -

‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి
‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. -

టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్ చూశారా!
‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్ చేశారు. -

‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే!
‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్ ప్రకటించింది. -

దీపికా పదుకొణె నా లక్కీ ఛార్మ్.. ‘ఏఏ 22’పై అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
దీపికా పదుకొణెపై దర్శకుడు అట్లీ ప్రశంసలు కురిపించారు. -

పవన్‌కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘ఉస్తాద్’ నుంచి అప్డేట్..
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ -

‘R’ విజయ్కెంతో స్పెషల్.. ‘రౌడీ జనార్ధన’, ‘రణబాలి’.. మీకేది నచ్చింది?
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఇప్పటికే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) చేస్తున్న సంగతి తెలిసిందే.











