Telugu songs: 2022ను ఓ ఊపు ఊపేసిన పాటలివే!

Eenadu icon
By Entertainment Team Updated : 31 Dec 2022 15:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

భారతీయ చిత్రాలకు పాటలే ప్రధాన ఆకర్షణ. అవే సగం బలం. పాటలు హిట్టయ్యాయంటే చాలు.. సినిమాకి ఊహించనంత ప్రచారం అవలీలగా వచ్చేస్తుంది. ప్రేక్షకులు థియేటర్లకు వరుస కట్టేస్తారు. అందుకే పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాయి చిత్ర బృందం. ఈ ఏడాది దాదాపు పదిహేనొందలకు పైగా గీతాలు సినీప్రియుల ముందుకొచ్చాయి. వాటిలో ఉర్రూతలూగించిన పాటలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది పలు ఐటమ్‌ సాంగ్స్‌ కూడా మెప్పించాయి.

  • ఈ ఏడాది ప్రేక్షకుల్ని బాగా ఊపేసిన గీతాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘‘నాటు.. నాటు’’ ఒకటి. ఆ పాటలో ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి వేసిన ఊర మాస్‌ స్టెప్పులు, వాళ్లిద్దరి టైమింగ్‌ చూడటానికి రెండు కళ్లూ సరిపోలేదంటే అతిశయోక్తి కాదు.
  • హుషారెత్తించే పాటలకు చిరునామాగా నిలుస్తుంటాయి చిరంజీవి చిత్రాలు. ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన ‘ఆచార్య’లో అలాంటి గీతాలు గట్టిగానే వినిపించాయి. ఇందులో ‘లాహే లాహే’ పాటలో చిరంజీవి వేసిన స్టెప్పులకూ మంచి ఆదరణ దక్కింది.
  • మహేష్‌బాబు - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘‘కళావతి’’, ‘‘మహేశా’’ గీతాలు కుర్రాళ్లకు గట్టిగా ఎక్కేశాయి.
  • ‘డీజే టిల్లు’లోని టైటిల్‌ పాట, ‘విక్రాంత్‌ రోణ’లోని ‘‘రా రా రక్కమ్మ’’ గీతం ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ.. అటు థియేటర్లలోనూ మోత మోగించేశాయి.
  • ‘సీతారామం’ చిత్ర విజయంలో సంగీతం ప్రధాన భూమిక పోషించింది. ఈ సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకుల మదిని సుతిమెత్తగా మీటాయి.
  • ఇక ‘కాంతార’లో ‘‘వరాహరూపం’’ పాట చేసిన మ్యాజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా ఆఖర్లో వచ్చే ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేసింది.
  • ఇవే కాదు.. ‘ది వారియర్‌’లోని ‘‘విజిల్‌ విజిల్‌’’, ‘మాచర్ల నియోజకవర్గం’లోని ‘‘రా రా రెడ్డీ’’, ‘భీమ్లానాయక్‌’లోని టైటిల్‌ పాట.. ఇవన్నీ సినీప్రియుల మెప్పు పొంది, శభాష్‌ అనిపించుకున్నవే.
  • వీటితో పాటు, ‘మాచర్ల నియోజకవర్గం’లోని ‘రారా రెడ్డి’, ‘బింబిసార’నుంచి గులేబకావళి, ఆచార్య నుంచి ‘శానకష్టం వచ్చిందే’, గాడ్‌ఫాదర్‌ ‘బ్లాస్ట్‌ బేబీ’, ‘ఖిలాడి’ నుంచి ‘క్యాచ్‌మి’, ‘ది వారియర్‌’నుంచి ‘బుల్లెట్‌’ పాటలు యువతను విశేషంగా అలరించాయి.









Tags :
Published : 31 Dec 2022 14:38 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు