Nikhil: విజయమే ఎక్కువ ఒత్తిడి!

కొత్తదనం నిండిన కథలకు చిరునామాగా నిలుస్తూ.. సినీప్రియుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయకుడు నిఖిల్ (Nikhil). ఇటీవలే ‘కార్తికేయ2’తో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఆయన ఇప్పుడు ‘18పేజెస్’తో (18 Pages) వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. సుకుమార్ అందించిన కథతో.. పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన చిత్రమిది. అనుపమ పరమేశర్వన్ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నిఖిల్.
‘కార్తికేయ2’తో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఎలా అనిపిస్తోంది?
‘‘పాన్ ఇండియా హీరో’ అన్న ప్రతిసారీ ఒత్తిడిగానే అనిపిస్తోంది. చాలా మంది నేనింకా ‘కార్తికేయ2’ (Karthikeya 2) విజయాన్ని వేడుక చేసుకుంటున్నామో అనుకుంటున్నారు. కానీ, నా దృష్టంతా తర్వాతి చిత్రం ఎలా ఉండాలి.. ప్రేక్షకుల మూడ్ ఎలా ఉంది? అనే వాటిపైనే ఉంది. ఎందుకంటే ఇకపై ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది’’.
‘18పేజెస్’ కథలో మార్పులు చేసినట్లున్నారు? సినిమా ఆలస్యానికి కారణం అదేనా?
‘‘కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే గతంలో మేము హడావుడిగా తీసిన కొన్ని సన్నివేశాల్ని ఈసారి మరింత మెరుగ్గా తిరిగి చిత్రీకరించాం. దీనికి తోడు సుకుమార్ ‘పుష్ప’తో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్ర ముగింపు కోసం ఆరు నెలలు వేచి చూడాల్సి వచ్చింది. సుకుమార్ మొదట ఏ కథైతే రాశారో.. అదే తెరపై కనిపిస్తుంది’’.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్న ఆలోచన చేయలేదా?
‘‘2019లో ఒప్పుకున్న చిత్రమిది. అప్పటికి మాపై ఎలాంటి అంచనాలు లేవు. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కదాని.. కథలో మార్పులు చేర్పులు చేసేయాలనుకోవడం సరికాదు. మేము తొలుత ఏ కథైతే అనుకున్నామో.. దాన్ని అలాగే చెప్పాలి. ఒకవేళ దీన్ని మిగతా భాషల్లో విడుదల చేయాలన్నా.. డబ్బింగ్ పనుల కోసమే మరింత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో సాదాసీదాగా డబ్ చేసి వదిలేస్తామంటే కుదరదు. ఏం చేసినా పక్కా ప్రణాళికతోనే చేయాలి. మేము ‘కార్తికేయ2’ని మొదటి నుంచీ పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేయాలనుకున్నాం. అందుకు తగ్గట్లుగానే నటీనటుల్ని తీసుకున్నాం. ఎంతో జాగ్రత్తగా డబ్బింగ్ పనులు పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాం’’.
‘కార్తికేయ2’ తర్వాత మీ కథల ఎంపికలో ఏమన్నా మార్పు వచ్చిందా?
‘‘నేను అనుకోకుండా హీరో అయ్యాను. ఊహించని రీతిలో విజయాలు అందుకున్నా. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆదరణ దక్కించుకున్నా. నాకు తెలిసి సక్సెస్ కన్నా ఏదీ ఎక్కువ ఒత్తిడి కాదు. ఇకపై ఎలా ముందుకెళ్లాలి అన్న విషయంలో కాస్త సందిగ్ధత ఉంది. అయితే నేను నమ్మేది ఒక్కటే... ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే కచ్చితంగా కథ ఆసక్తిరేకెత్తించేలా ఉండాల్సిందే. అలాంటి ఆసక్తికరమైన కథల్లోనే నేనుభాగమవ్వాలని అనుకుంటున్నా’’.
కొత్త చిత్ర విశేషాలేంటి?
‘‘ప్రస్తుతం నేను ‘స్పై’ చిత్రం చేస్తున్నా. పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ‘కార్తికేయ3’ వచ్చే ఏడాది ఆఖర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. హిందీ నుంచీ అవకాశాలొస్తున్నాయి. కాకపోతే నేను తెలుగు సినిమాలే చేయాలనుకుంటున్నా. వాటినే ఇండియా మొత్తానికీ చేరువయ్యేలా చేయాలనుకుంటున్నా’’.
సుకుమార్ ప్రేమకథలు చాలా విభిన్నంగా ఉంటాయి. మరి ఈ చిత్రం ఎలా ఉండనుంది?
‘‘సుకుమార్ మార్క్ సినిమా అంటుంటారు కదా.. ఇది ఆయన స్టాంప్‌లా ఉంటుంది. నేనిప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు. ఇందులో నాయకానాయికల పాత్రలు, కథ, స్క్రీన్‌ప్లే.. ప్రతి ఒక్కటీ చాలా వెరైటీగా ఉంటాయి. ముగింపు ఎవరి ఊహలకూ అందని విధంగా ఉంటుంది. ఈ సినిమాతో యువతరానికి మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

అందుకే ఆరోజు శివాజీని ఆపలేదు: నవదీప్
‘దండోరా’ ప్రచారంలో భాగంగా చిత్రబృందం చిట్‌చాట్ నిర్వహించింది.
-

చిన్న సినిమాలదే పెద్ద కటౌట్
తెలుగు సినిమా కథ 2025లోనూ ఏమీ మారలేదు. ఎప్పట్లాగే 240కిపైగా సినిమాలు రూపొందితే... అందులో వేళ్లపై లెక్కపెట్టేటన్నే విజయాలు. భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తా పడ్డాయి. -

అందరి జీవితాల్లో ఓ భాగం.. నువ్వు నాకు నచ్చావ్
‘‘కొన్ని సినిమాలు డబ్బులు... మరికొన్ని సినిమాలు పేరునీ తీసుకొస్తాయి. గౌరవం మాత్రం చాలా కొన్ని సినిమాలే తీసుకొస్తాయి. -

ఎన్టీఆర్‌కు ప్రైవసీ హక్కుల రక్షణ.. దిల్లీ హైకోర్టు ఆదేశం
ఎన్టీఆర్ ప్రైవసీ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పలు వెబ్సైట్లు, ఆన్లైన్ వేదికలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. -

చైనాకు భారత్ కౌంటర్
భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, తమ భావాలను కథల రూపంలో వ్యక్తపరచడం కూడా ఇందులో భాగమే అంటూ చైనా మీడియాకు భారత్ గట్టిగా బదులిచ్చింది. -

బాసూ... అదిరిపోద్ది సంక్రాంతి
‘‘ఇరగదీద్దాం సంక్రాంతీ.. అదిరిపోద్ది సంక్రాంతీ’’ అంటూ పండగ బరిలో కలిసికట్టుగా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్. -

అందరి కోరిక నా విజయమే
‘‘సాయికుమార్‌తో మాది మూడు తరాల అనుబంధం. ఆది సాయికుమార్ అద్భుతంగా నటించి కొంచెం ఆలస్యంగానైనా మంచి విజయాన్ని అందుకున్నాడు. -

సంక్షిప్త వార్తలు (4)
కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ కొత్త కబురు వినిపించారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో అందర్నీ మెప్పించిన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జేతో ఓ సినిమా చేయనున్నారు. -

ఓటీటీలోకి ‘బ్యూటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘బ్యూటీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మూడు నెలల తర్వాత ఇది ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -

ఆ సినిమా నా కెరీర్‌ను మలుపుతిప్పింది: అనిల్ రావిపూడి
‘మన శంకరవరప్రసాద్ గారు’లో మూడో పాటను తాజాగా విడుదల చేశారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

చైనా నాసిరకం ఉత్పత్తులే టార్గెట్.. స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్‌లు..!
-

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం.. పలువురికి గాయాలు
-

ఏపీలో రెండు కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/12/2025)
-

ఆకలితో వృద్ధుడి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె!
-

సంక్రాంతికి హైదరాబాద్- విజయవాడ హైవేపై టోల్ ఫీజు మినహాయించండి: కోమటిరెడ్డి


