HUNT: ప్రమోషన్స్‌ లేకుండా ఓటీటీలోకి వచ్చేస్తోన్న సుధీర్‌ కొత్త సినిమా

నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu) నటించిన రీసెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హంట్‌’. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది.

Published : 09 Feb 2023 14:14 IST

హైదరాబాద్‌: సుధీర్‌బాబు (Sudheer Babu) నటించిన సరికొత్త చిత్రం ‘హంట్‌’ (HUNT). మహేశ్‌ దర్శకుడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26న విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, ‘హంట్‌’ ఓటీటీ రిలీజ్‌కు తాజాగా రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 10) నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇదే విషయాన్ని ఆహా నేడు అధికారికంగా ప్రకటించింది.

కథేంటంటే: అర్జున్‌ అలియాస్‌ అర్జున్‌ ప్రసాద్‌ (సుధీర్‌బాబు) అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా సైబరాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తుంటాడు. ఓ రోడ్డు ప్రమాదం వల్ల గతం మర్చిపోతాడు. ఆ ప్రమాదం జరగడానికి ముందు తన మిత్రుడు, తోటి ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఆర్యన్‌ దేవ్‌ (భరత్‌) హత్య కేసును డీల్‌ చేస్తాడు. ఆ కేసును ఛేదించే సమయంలోనే అర్జున్‌ ప్రమాదానికి గురై.. గతాన్ని మర్చిపోతాడు. అసలు తనెవరో తనకే తెలియని అర్జున్‌.. తన గత జీవితం గురించి తెలుసుకుంటూ మరోవైపు ఆర్యన్‌ హత్య కేసును ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అసలు అర్జున్‌ గతమేంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని