- TRENDING
- T20 World Cup
- TG Muncipal Elections
Junior Movie Review: రివ్యూ: జూనియర్.. కిరీటి, శ్రీలీల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మెప్పించిందా?
Junior Movie Cast || చిత్రం: జూనియర్; నటీనటులు: కిరీటి, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్రన్, రావు రమేశ్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్; నిర్మాత: రజనీ కొర్రపాటి; రచన, దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి; విడుదల: 18-07-2025 (Junior Movie Release Date)

Junior Movie Review: గాలి జనార్దన్‌రెడ్డి తనయుడి సినిమాగా... వైరల్ వయ్యారి పాటతోనూ అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం... ‘జూనియర్’. శివ రాజ్‌కుమార్, ఎస్.ఎస్.రాజమౌళి తదితర ప్రముఖులు ఈ సినిమా (Junior Movie 2025) ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పుష్కర కాలం తర్వాత జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా. మంచి అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
కథేంటంటే..
Junior Movie Story: జ్ఞాపకాలే ముఖ్యం అనుకునే కుర్రాడు అభి (కిరీటి). ‘అరవయ్యేళ్లొచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా’ అనేది అతని సిద్ధాంతం. కళాశాలలో నాలుగేళ్ల జీవితాన్ని స్నేహితులతో కలిసి సరదా సరదాగా గడుపుతాడు. చిన్నప్పట్నుంచి తాను కోల్పోయిన జీవితాన్ని, జ్ఞాపకాల్ని పోగు చేసుకుంటాడు. ఆ తర్వాత తాను మనసు పడిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. కానీ, అక్కడ బాస్ అయిన విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే అస్సలు పడదు. ఆమెకు తన పేరుతోనే ఉన్న విజయనగరం అనే ఊరంటే కూడా నచ్చదు. అలాంటి ఇష్టం లేని ఊరికి, ఇష్టం లేని ఉద్యోగి అయిన అభితో కలిసి వెళ్లాల్సి వస్తుంది. అదెందుకు? (Junior Movie 2025 Review) అక్కడికి వెళ్లాక ఏం జరిగింది?ఆ ఊరికీ, విజయ సౌజన్యకీ మధ్య సంబంధం ఏమిటి?ఆమెకీ, ఆ ఊరికి చెందిన కోదండపాణి (రవిచంద్రన్)కీ మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
(Junior Review) తొలి సినిమా అనగానే... హీరో డాన్సులు బాగా చేశాడా? ఫైట్లు ఎలా ఉన్నాయి? పాత్రలో ఎంత హుషారుగా కనిపించాడు? హీరోయిజం ఎలా ప్రదర్శించాడనే విషయాల్ని ఎక్కువగా ఆరా తీస్తుంటారు. అందుకే తారల వారసులు, ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చే కథానాయకులు వాళ్ల ప్రతిభని పూర్తిగా ఆవిష్కరించే ఓ షో రీల్ తరహా సినిమాల్ని సిద్ధం చేయించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. ‘జూనియర్’ (Junior 2025) కూడా ఆ లెక్కల ప్రకారమే రూపొందింది. కథానాయకుడి తండ్రి ఫ్లాష్‌బ్యాక్‌తో సినిమా ఆరంభమైనా... ప్రథమార్ధం దాదాపుగా హీరో చేసే రకరకాల విన్యాసాలతోనే సాగుతుంది. పార్కర్ ఫైటింగ్‌తో హీరో (Kireeti) పరిచయం కావడం, ఆ తర్వాత హుషారైన డాన్స్‌తో కూడిన పాట, తన గ్యాంగ్‌తోనూ, హీరోయిన్‌తోనూ (Sreeleela) కలిసి చేసే అల్లరితో సన్నివేశాలు... ఇలా ఫస్టాఫ్ మొత్తం ఓ టెంప్లేట్ ప్రకారమే సాగుతుంది. హాస్యం పండటం కలిసొచ్చింది. జెనీలియా పాత్ర పరిచయం నుంచి కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అక్కడ్నుంచి కుటుంబం, అనుబంధాలు, గ్రామీణ నేపథ్యం... ఇలా ప్రేక్షకుడు ఊహించనంత దూరం ప్రయాణం చేస్తుంది. అయితే ఎక్కడా కొత్తగా అనిపించదు. తెలిసిన ఈ కథని కొత్తగా చెప్పే ప్రయత్నం కనిపించలేదు. హీరోకీ, జెనీలియాకీ మధ్య సంబంధాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతాయి.

అక్కడ్నుంచి ఆ ఇద్దరి మధ్య డ్రామా మొదలవుతుందని ఆశిస్తాం. కానీ, ఫ్లాష్‌బ్యాక్ తర్వాత అనూహ్యంగా మళ్లీ కథ పల్లెటూరి బాట పడుతుంది. ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ తదితర సినిమాల్ని గుర్తు చేస్తూ సన్నివేశాలు సాగుతాయి. (Junior Movie 2025 Review Telugu) ద్వితీయార్ధంలో భావోద్వేగాల్ని బలంగా పండించేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా దృష్టిపెట్టలేదు. దాంతో కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రభావం చూపించాయి. పతాక సన్నివేశాలకి ముందు వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. హీరో టాలెంట్‌ని తెరపై ఆవిష్కరిస్తూ, ఓ పెద్ద కథని చెప్పే ప్రయత్నం మాత్రమే చేశారు.
ఎవరెలా చేశారంటే..
కిరీటి (Junior Movie Kireeti) హుషారైన తన నటనతో ఆకట్టుకున్నాడు. డాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. తెరపై కనిపించిన విధానం కూడా బాగుంది. వైరల్ వయ్యారి పాటలో అయితే పైసా వసూల్ అనిపించాడు. శ్రీలీల, కిరీటి పోటాపోటీగా ఆ పాటలో ఆడిపాడారు. కథానాయిక శ్రీలీల పాత్రకి సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల కోసమే అన్నట్టుగా ఆమె తెరపై కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో వైరల్ వయ్యారి పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా జెనీలియా కనిపించిన విధానం, ఆమె నటన మెప్పిస్తుంది. కీలకమైన పాత్రతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు కానీ, అందులో నటించేందుకే ఆమెకు పెద్దగా ఆస్కారం లభించలేదు. రావు రమేశ్, రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించి, పరిధి మేరకు నటించారు. అచ్యుత్‌కుమార్ విలన్‌గా కనిపిస్తారు. అందులో బలం లేదు. వైవా హర్ష, సత్య అక్కడక్కడా కొన్ని నవ్వులు పంచారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి (Kireeti Movie) హైలైట్. సెంథిల్ ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. ఎడిటింగ్, కళ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పాటల రచయిత కళ్యాణ చక్రవర్తి ఈ సినిమాతో మాటల రచయితగానూ మెప్పించారు. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడిగా పట్టు ప్రదర్శించారు కానీ, రచనలో కొత్తదనం చూపించలేకపోయారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + కిరీటి హుషారైన నటన
- + ప్రథమార్ధం
- + వైరల్ వయ్యారి గీతం
- బలహీనతలు
- - భావోద్వేగాలు
- - వైవిధ్యం లేని కథ, కథనం
- చివరిగా: జూనియర్... కిరీటి షో (Junior Movie 2025 Review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

రివ్యూ: హనీ.. మరో క్షుద్ర నేపథ్యంతో వచ్చిన నవీన్ చంద్ర థ్రిల్లర్ మెప్పించిందా?
నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? -

రివ్యూ: శ్రీ చిదంబరంగారు.. వైవిధ్య కథాంశంతో వచ్చిన మూవీ మెప్పించిందా?
ఫిబ్రవరిలో బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల జోరు కనిపిస్తోంది. అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘శ్రీ చిదంబరంగారు’. -

రివ్యూ: యుఫోరియా.. గుణశేఖర్‌కు విజయాన్ని అందించిందా?
ఈసారి విజయమే లక్ష్యంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ తీసిన చిత్రం ‘యుఫోరియా’. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?Euphoria Movie Review -

రివ్యూ: సర్వం మాయ.. మలయాళంలో రూ.140కోట్లు వసూలు.. మూవీ ఎలా ఉంది?
సింపుల్ కథకు హృద్యమైన సన్నివేశాలు జోడించి సినిమాను తీర్చిదిద్దుతుంటారు మలయాళ దర్శకులు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’. -

రివ్యూ: గాంధీ టాక్స్.. మూకీ సినిమా ఎలా ఉంది?
‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ ఆకర్శించారు దర్శకుడు కిశోర్. ఈ చిత్ర కథేంటి? మాటల్లేని ఈ సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? -

రివ్యూ: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా మెప్పించిందా?
‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో విజయవంతమైన ‘జయ జయ జయ జయహే’కి రీమేక్ ఇది. మరి మాతృకతో పోలిస్తే ఇందులో కనిపించే కొత్త అంశం ఏంటి? ఎలాంటి వినోదాన్ని ఇచ్చింది? -

‘సిరై’.. రూ.3కోట్లతో తీస్తే రూ.30 కోట్లు వసూలు చేసిన క్రైమ్ డ్రామా ఎలా ఉంది?
తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటుడు విక్రమ్ ప్రభు. వైవిధ్యమైన కథలతో అలరించే ఆయన నటించిన 25వ చిత్రం ‘సిరై’. -

రివ్యూ: ‘బోర్డర్2’.. దేశభక్తి నేపథ్యం మరోసారి మెప్పించిందా?
బాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రాల్లో ‘బోర్డర్’కి ప్రత్యేక స్థానముంది. ఇప్పుడు 28ఏళ్ల తర్వాత ‘బోర్డర్ 2’ను తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు అనురాగ్ సింగ్. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకుల్ని అలరించిందా? -

రివ్యూ: చీకటిలో.. శోభిత ధూళిపాళ్ల క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ‘చీకటిలో..’ ఎలా ఉంది?ఎలాంటి థ్రిల్ పంచింది? -

రివ్యూ: తస్కరీ.. ఇమ్రాన్ హష్మీ వెబ్‌సిరీస్ థ్రిల్ పంచిందా?
ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘తస్కరీ’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే? -

రివ్యూ: కలాంకావల్.. సైకో కిల్లర్‌గా మమ్ముట్టి.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘కలాంకావల్’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? -

రివ్యూ: నారీ నారీ నడుమ మురారి.. శర్వానంద్ మూవీ ఎలా ఉందంటే?
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదలైంది. -

రివ్యూ: అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి ఎంటర్‌టైనర్ ఎలా ఉంది?
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో మారి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైన్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? -

రివ్యూ: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా?
రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? -

రివ్యూ: మన శంకరవరప్రసాద్‌గారు.. చిరు-అనిల్ కాంబో మెప్పించిందా?
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? -

వెబ్‌సిరీస్ రివ్యూ: కానిస్టేబుల్ కనకం: సీజన్-2.. చంద్రిక బతికే ఉందా?
వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చూపించారు. మరి ఇప్పుడు వచ్చిన సీజన్2 ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది. -

రివ్యూ: ‘ది రాజాసాబ్’.. ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ ఎలా ఉంది?
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది. -

రివ్యూ: రూ.5 కోట్లతో తీస్తే.. రూ.50 కోట్లు వసూలు చేసిన ‘ఎకో’ ఎలా ఉంది?
మలయాళంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘ఎకో’ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంది? -

రివ్యూ: ఇక్కీస్.. బాలీవుడ్ వార్ యాక్షన్ డ్రామా ఎలా ఉంది?
గతేడాది బాలీవుడ్లో హిట్లు తక్కువే అయినా.. వసూళ్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టించాయి. కొత్త ఏడాది ‘ఇక్కీస్’తో హిందీ సినిమా మొదలైంది. మరి మూవీ కథేంటి? ఎలాఉంది? -

రివ్యూ: ‘వనవీర’.. పురాణాల టచ్.. గ్రామీణ నేపథ్యం.. సినిమా ఎలా ఉంది?
అవినాశ్ తిరువీధుల హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘వనవీర’. జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది?











