Deepika Padukone: దీపికా పదుకొణె రూ.25 కోట్లు డిమాండ్‌!.. దర్శకుడు ఏమన్నారంటే!

Eenadu icon
By Entertainment Team Published : 13 Jun 2025 11:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) తన డిమాండ్ల కారణంగా ఓ భారీ ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చిందనే వార్త సోషల్‌ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. వర్కింగ్‌ అవర్స్‌, భారీ పారితోషికం డిమాండ్‌ చేశారని, అందువల్లే ఆమెను చిత్రబృందం తొలగించిందని ప్రచారం జరిగింది. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ (Kabir Khan) ఈ విషయాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘నేను 500 మంది సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాను. సినీ రంగంలోని వారికి కూడా సొంత జీవితాలు ఉంటాయి. వారి ఆరోగ్యం కూడా ముఖ్యమే. వర్కింగ్‌ అవర్స్‌ విషయంలో దీపికా డిమాండ్‌ న్యాయమే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లు కూడా 8 గంటల షిఫ్ట్‌లోనే పని చేస్తారు. దీపికా విషయంలో ఇది ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదు. దీన్ని నిరాకరించడానికి దర్శకులకు సరైన కారణం ఉండాలి. సినిమా రంగంలో ఉన్నవారు షూటింగ్‌ల కోసం వారి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలనే విషయాన్ని నేను అంగీకరించను. నేనెప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్‌ చేయలేదు. అలాగే, ఆదివారాల్లోనూ చిత్రీకరణ చేయను’’ అని చెప్పారు.

ఇక దీపికా రూ.25 కోట్లు డిమాండ్‌ చేయడంపై కబీర్‌ఖాన్‌ తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు ఎవరైనా తగిన పారితోషికానికి అర్హులేనన్నారు. వ్యక్తులను చూసి కాకుండా వారికి ఉన్న స్టార్‌డమ్‌ చూసి రెమ్యూనరేషన్‌ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీపికా ప్రాజెక్ట్‌పై వస్తోన్న వార్తల గురించి ఆమె స్పందించకపోయినప్పటికీ బాలీవుడ్‌ తారలు ప్రత్యక్షంగా పరోక్షంగా.. వేదికపై, ఇంటర్వ్యూల్లోనూ దీని గురించి మాట్లాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని