keerthy suresh: కీర్తి సురేశ్‌ హిందీ చిత్రం ప్రారంభం

అందం, అభినయంతో అన్ని భాషల్లోనూ దూసుకెళ్తోంది కీర్తి సురేశ్‌. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి వరుణ్‌ ధావన్‌కి జంటగా ఓ చిత్రంలో నటిస్తోంది. ఎ కాళేశ్వరన్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 15 Jan 2024 09:25 IST

అందం, అభినయంతో అన్ని భాషల్లోనూ దూసుకెళ్తోంది కీర్తి సురేశ్‌. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి వరుణ్‌ ధావన్‌కి జంటగా ఓ చిత్రంలో నటిస్తోంది. ఎ కాళేశ్వరన్‌ తెరకెక్కిస్తున్నారు. ఏ ఫర్‌ యాపిల్‌, సినీ 1 స్టూడియోస్‌ పతాకాలపై మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివారం ముంబయిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. దీనికి దర్శక నిర్మాతలు, తారాగణమంతా హాజరైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘మా హృదయాలకు ఎంతో దగ్గరైన ఈ ప్రాజెక్టు మంచి విజయం సాధించాలని మమ్మల్ని ఆశీర్వదించండి. త్వరలోనే సినిమా టైటిల్‌ ప్రకటిస్తాం’ అంటూ వ్యాఖ్యలు జోడించారు వరుణ్‌ ధావన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని