Vennela Kishore: అండమాన్‌కు వెళ్లి డ్యాన్స్‌ చేస్తా: వెన్నెల కిశోర్‌

Eenadu icon
By Entertainment Team Published : 28 Sep 2022 01:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య, షిర్లీ సేతియా జంటగా దర్శకుడు అనిష్‌ ఆర్‌ కృష్ణ రూపొందించిన ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari) చిత్రం ఇటీవల విడుదలై, ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం రోజుకో ప్రోమోను సినీ అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా విడుదలైన ప్రోమోలోనే వెన్నెల కిశోర్‌ అండమాన్‌కు వెళ్లి డ్యాన్స్‌ చేస్తానన్నారు. ‘వీడికి పిల్లలు పుడితే ఆ డాక్టర్‌ సర్టిఫికెట్‌ చింపేసి, ఏ అమెజాన్‌కో అండమాన్‌కో వెళ్లిపోయి డ్యాన్స్‌ చేస్తా’ అని వైద్యుడి పాత్రలో వెన్నెల కిశోర్‌  సందడి చేశారు. తనదైన హావభావాలతో (Vennela Kishore) నవ్వులు పంచుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోతోపాటు మిగిలిన వాటినీ చూసి ఆనందించండి..




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని