Lavanya Tripathi: ‘వరుణ్‌తేజ్‌తో మళ్లీ కలిసి నటిస్తారా?’: లావణ్య త్రిపాఠి ఏమన్నారంటే?

‘వరుణ్‌తేజ్‌తో మళ్లీ కలిసి నటిస్తారా?’ అనే ప్రశ్నకు లావణ్య త్రిపాఠి సమాధానమిచ్చారు. ఆమె ఏం చెప్పారంటే?

Published : 23 Jan 2024 23:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో కలిసి నటించి అలరించిన జోడీ వరుణ్‌తేజ్‌ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఆ సినిమాల ప్రయాణంలో ప్రేమలో పడిన వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దంపతులైన తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి నటిస్తారా, లేదా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. వెబ్‌సిరీస్‌ ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ (Miss Perfect) ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న లావణ్య ఆ విషయంపై స్పందించారు. మంచి కథ ఉంటే తప్పకుండా కలిసి నటిస్తామని అన్నారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందేనన్నారు.

ఆస్కార్‌ నామినేషన్స్‌ 2024.. ఈ ఏడాది పోటీపడుతున్న చిత్రాలివే!

వరుణ్‌తేజ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘వరుణ్‌ మంచి లైఫ్‌ పార్టనర్‌. చాలా అంశాల్లో తను పర్‌ఫెక్ట్‌. నన్ను ప్రోత్సహిస్తాడు. నా పనిని (నటన) నేను కొనసాగిస్తా. మెగా కోడలిగా ఉండడం చాలా స్పెషల్‌. నటన విషయంలో ‘అలాంటి వాటిలో నటించు.. ఇలాంటివి వద్దు’ అనే పరిమితులు నా పేరెంట్స్‌ ఎప్పుడూ పెట్టలేదు. వరుణ్‌ ఫ్యామిలీ కూడా అలా చెప్పలేదు. కానీ, నా లిమిట్స్‌ నాకు ఉంటాయి. ఇంతకు ముందు ఎలాంటి సినిమాలు చేశానో ఇకపైనా అలాంటి వాటిలో నటిస్తా’’ అని తెలిపారు. వివాహం తర్వాత లావణ్య నటించిన తొలి ప్రాజెక్టు ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’. అభిజీత్‌ మరో కీలక పాత్రధారి. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఈ సిరీస్‌ ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరోవైపు, వరుణ్‌ కూడా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’ తెలుగు, హిందీ భాషల్లో వచ్చే నెల 16న విడుదల కానుంది. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా మానుషి చిల్లర్‌ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని