Lavanya Tripathi: వరుణ్‌ తేజ్‌ని ఉద్దేశించి లావణ్య త్రిపాఠి ఫస్ట్‌ పోస్ట్‌..!

తన భర్త వరుణ్‌ తేజ్‌ను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripati). అలాగే, తమకు విషెస్‌ చెప్పిన వారందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు.

Published : 19 Nov 2023 01:53 IST

హైదరాబాద్‌: వివాహమైన తర్వాత తొలిసారి తన భర్త వరుణ్‌ తేజ్‌ (Varun Tej)ని ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati). వరుణ్‌ మంచి మనసు ఉన్న వ్యక్తి అని ఆమె అన్నారు. తాము కలలు కన్న విధంగానే తమ పెళ్లి జరిగిందని చెప్పారు.

‘‘అద్భుతమైన ప్రేమ, దయ గల వ్యక్తి ఇప్పుడు నా భర్త అయ్యారు. (తన భర్తను ఉద్దేశించి) చెప్పడానికి నా వద్ద ఎంతో ఉంది కానీ, ఆ విషయాలన్నింటినీ మా మధ్యే దాచుకుంటాం. కుటుంబసభ్యులు, ఆత్మీయుల సమక్షంలో మా పెళ్లి ఎలా అయితే జరగాలని కలలు కన్నామో అదే విధంగా మూడు రోజుల పాటు వివాహం జరిగింది. మీ ఆశీస్సులతో ఈ వేడుకలను మాకెంతో ప్రత్యేకంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని ఆమె పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె తన పెళ్లి చీర, మెహందీని చూపించారు. మేలి ముసుగుపై ‘వరుణ్‌ లవ్‌’ అని ఆమె ప్రత్యేకంగా రాయించుకున్నారు. పుట్టిల్లు, అత్తింటివారితో దిగిన ఫొటోలను పంచుకున్నారు. లావణ్య పెట్టిన పోస్ట్‌కు వరుణ్‌ ఫిదా అయ్యారు. ముద్దు ఎమోజీతో కామెంట్‌ పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు