- TRENDING
- T20 World Cup
‘వారణాసి’ జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం: మహేశ్‌బాబు

హైదరాబాద్: ‘ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసే సినిమా, పాత్ర ఒకటి ఉంటుంది. నాకు ‘వారణాసి’ అలాంటిదే’ అంటున్నారు మహేశ్‌బాబు (Mahesh Babu). ఆయన కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ప్రియాంక చోప్రా జోన్స్ కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) ఈ మూవీ టైటిల్, స్పెషల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడారు. తనని, తన సినిమాలను ఆదరిస్తున్న అభిమానులకు చేతులెత్తి నమస్కారం చేశారు. వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు.
‘‘మిమ్మల్ని (అభిమానులు) కలుసుకుని చాలా రోజులైంది. ఇలా ఈ ఈవెంట్లో కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను నా వరకూ సాధారణంగా వచ్చేస్తానని చెప్పాను. కానీ, దర్శకుడు రాజమౌళి ఇలా స్పెషల్‌గా మీ ముందుకు తీసుకొచ్చారు. నాన్న కృష్ణగారు ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో ఎప్పుడూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి’’
‘‘ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. మరీ ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ‘వారణాసి’ విడుదలైనప్పుడు ఈ మూవీ చూసి, యావత్ దేశం గర్వపడుతుంది. ఇది టైటిల్ ప్రకటన మాత్రమే. మున్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలా ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపే అభిమానానికి ‘థ్యాంక్స్’ అన్నది చిన్న మాట అవుతుంది. మీరు చూపించే అభిమానం మాటల్లో చెప్పలేను. మీ ఆశీస్సులు, అభిమానం నాతోనే ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఈవెంట్ సజావుగా సాగడానికి సహకరించిన పోలీస్‌శాఖకు నా ధన్యవాదాలు’ అని అన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2027 (mahesh rajamouli movie release date) వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

సూర్య కొత్త సినిమా టైటిలిదే.. ఫస్ట్‌లుక్ చూశారా!
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. -

కౌంట్‌డౌన్ మొదలు.. ‘ధురంధర్: ది రివెంజ్’ ఈసారి ఐదు భాషల్లో..
రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కథానాయకుడిగా ఆదిత్యధర్ (Aditya Dhar) దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. -

పవర్ఫుల్ పాత్రలో మోహన్ బాబు.. లుక్ రిలీజ్
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. -

విరోష్ జోడి.. పెళ్లి వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చిన ‘రణబాలి’ టీమ్..
నిన్నటివరకూ వెడ్డింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఇప్పుడు కొత్త సినిమా లుక్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. -

క్రేజీ మల్టీస్టారర్.. ప్రకటించిన అనిల్ రావిపూడి
చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) చేయబోయే సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. -

‘విష్ణు విన్యాసం’.. అతి తక్కువ రన్‌టైమ్..
శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. -

డిఫరెంట్ లుక్‌లో శర్వానంద్.. ‘భోగి’ రిలీజ్ ఎప్పుడంటే!
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. -

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని, పవన్‌కల్యాణ్‌ను (Pawan Kalyan) ఎంటర్టైన్మెంట్ మోడ్‌లో చూస్తారని దర్శకుడు హరీశ్ శంకర్ స్పష్టత ఇచ్చారు. -

ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
2026లో మరో నెల ముగియడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. -

‘జై హనుమాన్’ మొదలైంది.. వీడియోలు వైరల్
‘జై హనుమాన్’ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. -

యాక్షన్‌తో థ్రిల్ చేసేందుకు.. సమంత ‘మా ఇంటిబంగారం’ రిలీజ్ అప్పుడే
సమంత నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. -

ఒకరోజు ముందుగానే శ్రీవిష్ణు సందడి..
శ్రీవిష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ ఒకరోజు ముందుగా విడుదలకు సిద్ధమైంది. -

ఈసారి యుద్ధం వేరు.. కుతంత్రాలు వేరు!
ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఒకటి. ‘కేజీఎఫ్’ విజయాల తర్వాత కథానాయకుడు యశ్ నుంచి వస్తున్న బహుభాషా చిత్రమిది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. -

మరో చారిత్రకగాథతో సంజయ్ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్’
భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్ దేన్ లైఫ్ కథలను అందించడంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తులు. -

చిన్న ఛేంజ్.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్ ఆ రోజే..
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్ఎస్ఎస్) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది. -

ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది
నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల వాయిదా పడింది. -

దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్.. అలరిస్తున్న ప్రమోషనల్ వీడియో
నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు. -

అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ : ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత
‘కపుల్ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్ మొగిలినేని తెలిపారు. -

వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
వాలెంటైన్స్ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి. -

2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఆసక్తికర పోస్టు
తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ప్రకటించింది.








