Manjima Mohan: పెళ్లిలో నన్ను విమర్శించారు: మంజిమా మోహన్
శరీరాకృతి విషయంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని నటి మంజిమా మోహన్ అన్నారు. ఇటీవల గౌతమ్‌ను పెళ్లాడిన సమయంలోనూ పలువురు పెళ్లిలోనే తనని కామెంట్ చేశారని ఆమె చెప్పారు.
చెన్నై: తమ మూడేళ్ల ప్రేమబంధాన్ని ఇటీవల వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు గౌతమ్ కార్తిక్ (Gautham Karthik), నటి మంజిమా మోహన్ (Manjima Mohan). వివాహం అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన మంజిమ.. ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెళ్లి ఫొటోల్లో తాను లావుగా ఉన్నానంటూ వస్తోన్న విమర్శలపై ఆమె స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. మా పెళ్లిలోనూ కొంతమంది నేను లావుగా ఉన్నానని కామెంట్ చేశారు. శరీరాకృతి విషయంలో ఎంతోకాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాను. అయితే, మొదట్లో కాస్త బాధపడ్డా. కానీ, ఇప్పుడు నేను ఫిట్, సంతోషంగానే ఉన్నా. నాకు తగ్గాలనిపించినప్పుడు తప్పకుండా తగ్గుతా’’ అని తెలిపారు. కెరీర్ గురించి స్పందిస్తూ తాను నటిగానే కొనసాగాలనుకుంటున్నానని, మంచి కథల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు.
కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘దేవరట్టం’ సినిమాతో గౌతమ్ కార్తిక్, మంజిమ మొదటిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా షూట్‌లో వీరిద్దరూ స్నేహితులయ్యారు. అనంతరం ప్రేమలో పడ్డారు. అయితే, వీరిద్దరూ మూడేళ్ల పాటు సహజీవనంలో ఉన్నారంటూ గతంలో వార్తలొచ్చాయి. వాటిపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజిమ స్పందించారు. ‘‘లాక్‌డౌన్ సమయంలో కుటుంబానికి దూరంగా నేను ఒక్కదానినే చెన్నైలో ఉన్నాను. గౌతమ్ వాళ్లింట్లో ఉన్నాడు. అయితే, మేమిద్దరం కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్లేవాళ్లం. దాంతో మేము సహజీవనంలో ఉన్నామంటూ వార్తలు వచ్చాయి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. మేమిద్దరం సహజీవనంలో లేము’’ అని ఆమె పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు