Mili: స్కిప్ట్‌ మార్చనంటేనే ‘మిలీ’ చేశా

జాన్వీకపూర్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిలీ’. మలయాళ మాతృక ‘హెలెన్‌’తో పోల్చితే హిందీ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుంది అంటున్నారు దర్శకుడు మత్తుకుట్టి జేవియర్‌.

Updated : 02 Nov 2022 09:01 IST

జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిలీ’ (Mili). మలయాళ మాతృక ‘హెలెన్‌’తో పోల్చితే హిందీ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుంది అంటున్నారు దర్శకుడు మత్తుకుట్టి జేవియర్‌ (Mathu Kutty). దీనిని బోనీకపూర్‌ నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలందించారు. నవంబరు 4న విడుదలవుతున్న సందర్భంగా మత్తుకుట్టి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులివి.
* ‘మిలీ’లో పాత్రలపరంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘హెలెన్‌’ స్క్రిప్ట్‌ని మార్చేసి హిందీలో తీద్దామని చాలామంది నిర్మాతలు అడిగారు. నేను ఒప్పుకోలేదు. చివరికి బోనీకపూర్‌ స్క్రిప్ట్‌ మార్చకుండానే చేద్దాం అన్నారు. నేను ఇందులో నా బెస్ట్‌ ఇచ్చాను.
*‘హెలెన్‌’ చిన్న బడ్జెట్‌ సినిమా. హిందీకొచ్చేసరికి పెద్ద చిత్రంగా మారింది. పాత్రలకు అనుగుణంగా నటీనటుల్ని ఎంచుకోవడం నాకు సవాలుగా మారింది. మరోవైపు భాష సమస్య. నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా, నేను అనుకున్న విధంగా సినిమా తీయడంలో జాన్వీ బాగా సాయపడింది.

*జానీ మిలీ నాడియల్‌ అనే నర్సు నటించింది. తను కెనడా వెళ్లి స్థిరపడాలనుకుంటుంది. కానీ అనుకోకుండా ఒక శీతల గిడ్డంగిలో ఇరుక్కుపోతుంది. తర్వాతేం జరిగింది అనేది కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని