Operation Valentine: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Eenadu icon
By Entertainment Team Published : 22 Mar 2024 11:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుణ్‌ తేజ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ కథానాయిక. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించారు. మార్చి ఆరంభంలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ఇది ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియో వేదికగా నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది.

క‌థేంటంటే: అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర  (వ‌రుణ్‌తేజ్‌) భార‌తీయ వైమానిక ద‌ళంలో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ ధైర్య సాహ‌సాలతో అడుగేసే ర‌కం. వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్లర్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలో ఓ చేదు అనుభ‌వం ఎదుర‌వుతుంది. దాన్నుంచి కోలుకుంటున్న క్ర‌మంలోనే ఆయ‌న ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? తదితర అంశాలతో ఇది తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు