Pushpa 2: తొలిరోజు పుష్పరాజ్‌ హవా.. వరల్డ్‌ వైడ్‌గా ‘వైల్డ్‌ ఫైర్‌’ రికార్డులివే

Eenadu icon
By Entertainment Team Published : 07 Dec 2024 13:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: వైల్డ్‌ ఫైర్‌ అంటూ థియేటర్‌లలోకి అడుగుపెట్టిన పుష్పరాజ్‌ వరల్డ్‌ వైడ్‌గా సందడి చేస్తున్నాడు. విడుదలకు ముందునుంచే రికార్డులు సొంతం చేసుకున్న ‘పుష్ప2’ (Pushpa 2) రిలీజ్ తర్వాత కూడా హవా కొనసాగిస్తోంది. మొత్తం 12 వేల థియేటర్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఓవర్సీస్‌లోనే 4,783 థియేటర్‌లలో ‘పుష్ప2’ విడుదలైంది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్ తొలిరోజు రూ.294 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పలు రాష్ట్రాల్లోనూ రికార్డులను నెలకొల్పింది. అవేంటంటే..

  • హిందీలో డబ్‌ అయిన సినిమాల్లో ఉత్తర అమెరికాలో వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది. 
  • విడుదలకు ముందు బుక్‌ మై షోలో గంటలో లక్ష టికెట్లు అమ్ముడైన చిత్రంగా రికార్డు నెలకొల్పిన ‘పుష్ప2’.. విడుదల తర్వాత ఆ రికార్డును అదే బ్రేక్‌ చేసింది. రెండోరోజు కూడా గంటలో లక్షకు పైగా టికెట్స్‌ అమ్ముడయ్యాయి (Pushpa 2 Records).
  • నార్త్‌ అమెరికాలో రెండు రోజుల్లో 6 మిలియన్ల డాలర్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘పుష్ప2’ రికార్డు నెలకొల్పింది.
  • ‘పుష్ప2’కు సపోర్ట్‌ చేసిన జాన్వీకపూర్‌.. వారికి కౌంటర్‌ ఇస్తూ రిప్లై
  • కర్ణాటకలో ‘పుష్ప2’ మొదటిరోజు రూ.23.7 కోట్లు (గ్రాస్‌) వసూళ్లు చేసింది. తెలుగు సినిమాకు మొదటిరోజే అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
  • విదేశాల్లో ఈ చిత్రం ఇప్పటివరకు 8 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసింది. ఇండియన్‌ సినిమాకు ఇన్ని ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి (Pushpa 2 Worldwide Records).
  • కేరళలో రూ.6.35 కోట్లతో బాక్సాఫీస్‌ను ఓపెన్‌ చేశాడు పుష్పరాజ్‌. 2024లోనే కేరళలో ఇది బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ అని నిర్మాణసంస్థ తెలిపింది.
  • తమిళనాడులో ‘పుష్ప2’ మొదటిరోజు రూ.11 కోట్లు (గ్రాస్‌) వసూళ్లు చేసింది. తెలుగు డబ్బింగ్‌ సినిమాకు తమిళనాడులో ఇన్ని కోట్లు రావడం ఇదే మొదటిసారి. 
  • బీటౌన్‌ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఈ మూవీకి ఫస్ట్‌డే ఏకంగా రూ.72 కోట్లు (నెట్‌) వచ్చాయి. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే హిందీలో తెలుగు సినిమాకు ఇన్ని కోట్లు రావడం ఇదే మొదలు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 
  • తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ.30 కోట్ల షేర్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది (Pushpa 2 Telugu States Collections).
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు