Ram Charan: సినిమా సరిహద్దులు చెరిపేస్తాం

రామ్‌చరణ్‌ ఓవైపు నటుడిగా రాణిస్తూనే... మరోవైపు కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి నిర్మాతగానూ కొనసాగుతున్నారు.

Updated : 26 May 2023 14:04 IST

రామ్‌చరణ్‌ ఓవైపు నటుడిగా రాణిస్తూనే... మరోవైపు కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి నిర్మాతగానూ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడాయన మరో నిర్మాణ సంస్థకు శ్రీకారం చుట్టారు. యూవీ క్రియేషన్స్‌లోని తన స్నేహితుడు విక్రమ్‌ రెడ్డితో చేతులు కలిపి ‘వి మెగా పిక్చర్స్‌’ అనే కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరిస్తూ సరికొత్త, వైవిధ్యమైన వాతావరణాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నాం. సృజనాత్మకతలో సినిమా సరిహద్దులు చెరిపేస్తాం. వినోద పరిశ్రమలో అభివృద్ధి చెందుతోన్న కొత్త ప్రతిభను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి, ఓ సరికొత్త ప్రభావాన్ని చూపించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అన్నారు. ‘‘ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులతో కలిసి మా సంస్థ పని చేయనుంది’’ అన్నారు మరో నిర్మాత విక్రమ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని