Tamannaah: వయసు గురించి అంత భయమెందుకు!

Eenadu icon
By Cinema Desk Updated : 31 Oct 2025 05:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

గతేడాది ‘స్త్రీ 2’ చిత్రంలోని ‘ఆజ్‌ కీ రాత్‌’ పాటతో కుర్రకారుని విశేషంగా అలరించింది తమన్నా. ఆ తర్వాత ‘ఓదెలా 2’ చిత్రంలోనూ నాయికగా ప్రధాన పాత్ర పోషించింది. ఇలా తెరపై వైవిధ్యమైన పాత్రలతో అటు కథానాయికగానూ.. ఇటు ప్రత్యేక గీతాల్లో తనదైన స్టెప్పులతోనూ అలరిస్తోందీ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా చిత్ర పరిశ్రమలోని మార్పులు గురించి పలు అంశాలను పంచుకుంటూ, వయసు గురించి ఎందుకు భయపడతారంటూ ప్రశ్నిస్తోంది. ‘‘నేడు చిత్రపరిశ్రమలో 30 ఏళ్ల వయసున్న మహిళల పట్ల సానుకూల మార్పు కనిపిస్తోంది. దర్శకులు నటీమణుల కోసం వయసుని పరిగణనలో ఉంచుకుని పరిణతి చెందిన పాత్రలను ప్రత్యేకంగా సృష్టించి మరీ రాస్తున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన మార్పులతో నటులు వయసుతో సంబంధం లేకుండా నటనను కొనసాగించవచ్చని నమ్ముతున్నాను. నా ఇరవైల చివరిలో ఉన్నప్పుడు అదృష్టవశాత్తూ పరిశ్రమ ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు రాయడం ప్రారంభించింది. చాలా మంది వయసు పెరగడాన్ని ఏదో ఒక వ్యాధిలా భావిస్తున్నారు. కానీ వయసు జీవితంలో చాలా అద్భుతమైనది. అలాంటి దాని గురించి ఎందుకు అంతగా భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు’’అని చెప్పింది. తమన్నా తదుపరి షాహిద్‌ కపూర్‌తో కలిసి విశాల్‌ భరద్వాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఓ రోమియో’లో కనిపించనుంది.

Tags :
Published : 31 Oct 2025 01:56 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు