telugu movies: తెలుగు తెరకు పేరు బలం
శీర్షికల్లో భాషా సౌందర్యం
నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం

తెలుగు సినిమాకి అచ్చమైన తెలుగు పేరు పెట్టుకుంటే.. ఆ అందమే వేరుగా ఉంటుంది. పాత రోజుల్లో ప్రతి చిత్రానికీ అలా అచ్చతెలుగు దనాన్ని శీర్షికగా పెట్టేవారు. ఆ పేర్లు ఓ వైపు చిత్ర కథా నేపథ్యానికి అద్దం పట్టేలా ఉంటూనే.. మరోవైపు తెలుగు భాషా సొబగుల్ని అద్దుకొని పరిమళించేవి. ఆధునిక పోకడల వెంట పరుగులు తీయడం మొదలు పెట్టాక.. ఆ తెలుగు వెలుగులు కాస్త మసకబారాయి. యువతరాన్ని ఆకర్షించే క్రమంలో ఆంగ్ల పదాలను పేర్లుగా పెట్టేయడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు చిత్రసీమలో మళ్లీ మునుపటి తెలుగు వెలుగులు కనిపిస్తున్నాయి. పలువురు దర్శక నిర్మాతలు, కథానాయకులు తమ సినిమాలకు స్వచ్ఛమైన తెలుగు పేర్లు ఖరారు చేసి.. భాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. వెండితెరపై తెలుగు సొగసుల్ని గుబాళింపజేస్తున్నారు.

సాధారణంగా తెలుగు పేర్లు వినిపించడంలో చిన్న చిత్రాలే ఎక్కువ ముందుంటుంటాయి. అవన్నీ పేర్లతోనే సినీప్రియుల దృష్టిని ఆకర్షించి.. థియేటర్ల వైపు రప్పించే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పుడీ విషయంలో అగ్ర కథానాయకులు, దర్శకుల దృక్పథాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తదనం చూపిస్తూనే.. ఆకర్షణీయమైన అచ్చ తెలుగు పేర్లు వినిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు ఏ అగ్ర కథానాయకుడి ప్రచార చిత్రం చూసినా.. తెలుగుదనమే కనిపిస్తోంది. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’.. ఇలా దర్శకుడిగా సినీప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సినిమాకీ తెలుగు పేర్లనే ఖరారు చేస్తూ వస్తున్నారు కొరటాల శివ. ఇప్పుడీ క్రమంలోనే చిరంజీవి చిత్రానికి ‘ఆచార్య’ అనే పేరు ఖరారు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. చిరు - రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

* వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు పవన్ కల్యాణ్. ఇప్పుడాయన ‘భీమ్లానాయక్’గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన నుంచి రానున్న సినిమాలకి ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే నిండైన తెలుగు పేర్లనే నిర్ణయించారు.
* ‘అఖండ’గా వచ్చి అందరినీ అలరించారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడాయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా కోసం ‘జై బాలయ్య’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
* ‘శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా కొన్నాళ్లుగా తెలుగు పేర్లతోనే ప్రయాణిస్తూ వస్తున్నారు కథానాయకుడు మహేష్‌బాబు. ఇప్పుడీ పంథాలోనే పరశురామ్ సినిమా కోసం ‘సర్కారు వారి పాట’ అనే అచ్చ తెలుగు పేరు ఎంచుకున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్ - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న కొత్త చిత్రానికి సైతం ‘పార్థు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది.

వీళ్లూ ఆ దారిలోనే..
త్రివిక్రమ్, ఇంద్రగంటి మోహనకృష్ణ, క్రిష్ వంటి దర్శకులే కాదు.. ప్రస్తుతం వెండితెరపైకి వరుస కడుతున్న పలువురు కుర్ర దర్శకులు సైతం తెలుగు పేర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కుర్ర హీరోల సినిమాలు సైతం కమ్మనైన తెలుగు పేర్లతో ఊరిస్తున్నాయి. రానా.. ‘విరాటపర్వం’, నాని.. ‘అంటే సుందరానికి’, ‘దసరా’, శర్వానంద్.. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘ఒకే ఒక జీవితం’, నాగశౌర్య.. ‘కృష్ణ వ్రింద విహారి’, ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’, విష్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’, సుధీర్‌బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, సంతోష్ శోభన్ ‘అన్నీ మంచి శకునములే’, సమంత ‘శాకుంతలం’, ‘యశోద’ వంటివన్నీ పేర్లకు నిండైన తెలుగుదనాన్ని అద్దుకున్నవే. ఇలా మంచి తెలుగు పేర్లతో ప్రేక్షకుల ముందుకు వస్తే... గ్రామీణ స్థాయిలోనూ చిత్రాలకు ప్రచారం, ఆదరణ బాగుంటాయనేది దర్శక, నిర్మాతల భావన.

కొన్నింటితోనే ఇబ్బంది...
తమిళ, ఇతర భాషల నుంచి తెలుగు తెరపైకి ఏ చిత్రమొచ్చినా.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఓ అచ్చ తెలుగు పేరును ఖరారు చేయడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడిందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా భాషల సినిమాల్ని తెలుగులో నేరుగా అదే పేరుతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అజిత్ కథానాయకుడిగా నటించిన ‘వలిమై’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ నేరుగా అదే పేరుతో విడుదల చేస్తున్నారు. అలాగే సూర్య నటించిన ‘ఎతర్కుమ్ తునిందవన్’ను.. మిగతా అన్ని భాషల్లో ‘ఈటీ’ అనే సంక్షిప్త నామంతో విడుదల చేయనున్నారు. ఇది మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రాల్ని అన్ని భాషల్లోకి అనువాదం చేస్తున్న నిర్మాతలు.. ఆయా భాషలకు తగ్గట్లుగా పేర్లు ఖరారు చేయకపోవడంపై భాషా ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామవాచకాలంటే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు.. క్రియానామాలు సైతం పరభాషా పదాలు అలాగే ఉంచడాన్ని విమర్శిస్తున్నారు. రానున్న కొన్ని తెలుగు చిత్రాలకు సైతం ఆంగ్లంలో పేర్లు పెట్టడం మానుకోవాలని కోరుతున్నారు.

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

వీళ్లు సంక్రాంతికి వస్తారు.. హిట్టు కొడతారు.. రిపీట్
సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన హీరో శర్వానంద్, దర్శకుడు అనిల్ రావిపూడిపై ప్రత్యేక కథనం.. -

ప్రమోషన్స్‌లో ప్రేమ.. సక్సెస్ ఇచ్చిన అమ్మ మాట.. ‘ధురంధర్’ దర్శకుడి విశేషాలివీ!
‘ధురంధర్’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఆదిత్యధర్. ఆయన గురించి కొన్ని విశేషాలివీ.. -

బైసెప్స్.. బిగ్‌బాస్.. బాక్సాఫీస్.. బాలీవుడ్ ‘భాయ్’ సల్మాన్‌కు 60 ఏళ్లు..
ఇప్పటికీ మోస్ట్ ‘వాంటెడ్’ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. వినోదాలు, వివాదాలతో సల్మాన్ జీవితం సమతూకం. 60వ పడిలో అడుగు పెట్టిన సల్మాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు... -

‘మైసా జనార్ధనా’.. వెండితెరపై పారుతున్న రక్తపుటేర్లు
‘కాలే మంటల్లో ఉండే ఎరుపు కన్నా.. పారే రక్తంలో ఉండే ఎరుపే అందంగా ఉంటుంది’ అంటాడు ‘సలార్’లో పృథ్వీరాజ్ సుకుమారన్. -

బాక్సాఫీస్ లెక్క మార్చిన ‘ధురంధర్’.. రణ్వీర్ ఆ రికార్డు అధిగమిస్తాడా?
వారం పది రోజులకే అగ్ర కథానాయకుల సినిమాలు సైతం కలెక్షన్స్ లేక చతికిల పడుతుంటే, ‘ధురంధర్’ (dhurandhar) మాత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. -

‘అవతార్’.. అప్పుడొక విజువల్ వండర్.. ఆ క్రేజ్ ఇప్పుడు ఉందా?
అవతార్: ఫైర్ అండ్ యాష్’ పేరుతో డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో అసలు ‘అవతార్’ కథేంటి? అందులో పాత్రలేంటి? -

కుగ్రామం నుంచి బాలీవుడ్ వరకు.. ధర్మేంద్ర ప్రయాణమిదీ
భారతీయ చిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర (Dharmendra)ది ప్రత్యేక స్థానం. ఆయన నట ప్రయాణం వైవిధ్యం. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ కింగ్‌గా, హీ మ్యాన్‌గా తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. -

‘వారణాసి’ గ్లింప్స్.. రాజమౌళి విజన్ మైండ్ బ్లోయింగ్.. ఇవి గమనించారా?
‘వారణసి’.. ఒక్క మాట లేకుండా తాను తీయబోయే సినిమా స్థాయి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి మరోసారి చూపించారు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. -

‘వారణాసి’.. టైటిల్ లోగోలోనే కథా నేపథ్యం!
రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ లోగోను గమనించారా..? -

అదిగో పెళ్లి.. ఇదిగో గర్భం.. సినీ తారలకు తలనొప్పులు
సినీ తారల సంగతులతో సోషల్‌మీడియా ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటుంది. అందుకే ఆ తారలు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. -

27 ఏళ్లు ఆడిన సినిమా.. టీవీలోనూ రికార్డు: ‘డీడీఎల్జే’ విశేషాలివీ
30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు, రికార్డుల వివరాలివీ.. -

ఫస్ట్ ‘ఏఐ ఫిల్మ్ స్టార్’గా!.. ఎవరీ టిల్లీ నార్వుడ్
ప్రపంచంలోనే తొలి ఏఐ ఫిల్మ్ స్టార్‌గా టిల్లీ నార్వుడ్ నిలవనుంది. ఆ విశేషాలివీ.. -

కత్తులు.. తుపాకులు.. బాంబులు.. ఓ పవన్‌కల్యాణ్
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ విడుదల కానున్న సందర్భంగా ఆసక్తికర విషయాలు ఇవే.. -

మోహన్‌లాల్ సమ్మోహన నట శిఖరం.. ఆ ఒక్క ఏడాది 36 సినిమాలు..
మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రకటించిన సందర్భంగా మోహన్‌లాల్ గురించి ఆసక్తికర విశేషాలు.. -

‘కల్కి’ ప్రాజెక్ట్ నుంచి దీపిక ఔట్.. అసలు సమస్య అదేనా?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రాజెక్ట్ నుంచి దీపిక పదుకొణె (Deepika Padukone) ఔట్. ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్. -

అక్షయ్‌కుమార్- సైఫ్ మూవీలో హీరోయిన్గా.. ఎవరీ సయామీ ఖేర్?
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలివీ.. -

నాలుగు నిమ్మకాయలు.. ఓ ముగ్గు.. నల్లకోడి.. ఇది హిట్ స్టోరీ..
ఇక ఈ ఏడాది అగ్ర కథానాయకులు కూడా ఇదే కాన్సెప్ట్‌తో అలరించడానికి సిద్ధమయ్యారు. మరి తరాలుగా ఈ కాన్సెప్ట్ ఎలా మారుతూ వచ్చింది? ఇప్పుడెలా అలరిస్తోంది... -

నాగార్జున యంగ్ లుక్ రహస్యమిదే.. ‘కింగ్’ డైట్ ప్లాన్ తెలుసా?
‘62 ఏళ్ల వయసులోనూ యంగ్ లుక్‌లో కనిపించడానికి కారణం చెప్పండి నాగార్జున గారూ..’ అని అడిగితే, తాను పాటిస్తున్న 9 హెల్త్ సీక్రెట్స్‌ను చెప్పేశారిలా..! -

‘12th ఫెయిల్’.. నేషనల్ అవార్డ్స్‌లో డబుల్ ‘సక్సెస్’.. రెండు విభాగాల్లో ది బెస్ట్
జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’, ఉత్తమ నటుడు విక్రాంత్ మాస్సే గురించి ప్రత్యేక కథనం.. -

మా నాన్న చనిపోయినా నేను ఏడవలేదు.. ఎందుకంటే!: నటుడు రవికిషన్
నటుడు, రాజకీయ నాయకుడు రవికిషన్ తన చిన్ననాటి సంగతులను ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

గ్రీన్లాండ్లో అమెరికా యుద్ధ విమానం..!
-

కంటైనర్-కారు ఢీ: నలుగురి దుర్మరణం.. ముగ్గురికి తీవ్రగాయాలు
-

రిటైర్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు: సైనా నెహ్వాల్
-

ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా మారాలి: చంద్రబాబు
-

వారివల్లే టీమ్ఇండియాకు ఓటమి: సునీల్ గావస్కర్
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/01/2026)


