Thaman: ఆరు ఫ్లాప్‌ పాటలు చేద్దామని ఎవరూ రారు: తమన్‌

Eenadu icon
By Entertainment Team Updated : 21 Dec 2021 15:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను చేసిన పని పరాజయంపాలైనా, విజయం అందుకున్నా ఒకేలా స్వీకరిస్తానని, రెండిటి నుంచీ ఏదో ఒకటి నేర్చుకుంటానని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. కావాలని ఎవరూ ఫ్లాప్‌ సినిమాలు చేయరని తెలిపారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తమన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను ఆరో తరగతి వరకే చదువుకున్నానని, అప్పుడు చదివింది ఏదీ ఇప్పుడు ఉపయోగపడటంలేదని సరదాగా చెప్పుకొచ్చారు. చెన్నైలో ఉన్నప్పుడు పోస్టర్లు చూసి తమిళం, తెలుగు, ఇంగ్లిష్‌ మాట్లాడటం నేర్చుకున్నానని, హెడ్‌ మాస్టర్‌లాంటి త్రివిక్రమ్‌ పరిచయమయ్యాక తెలుగు రాయడం నేర్చుకుంటున్నానని వివరించారు.

తొలిసారి ‘భైరవదీపం’ చిత్రానికి పనిచేశానని, ఇప్పుడు ‘అఖండ’కి పనిచేయడం ఆనందంగా ఉందని బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇళయరాజా, ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతంలో తనకు స్ఫూర్తి అని తెలిపారు. తన సతీమణి చాలా ప్రతిభావంతురాలని, దాంతో ఇంట్లోనే తనపై ట్రోలింగ్‌ అయిపోతుందన్నారు. ఈ కారణంగానే బయట వచ్చే ట్రోల్స్‌ని పట్టించుకోనని చెప్పుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ ‘ఫ్లాప్‌ సినిమా చేస్తున్నా.. ఆరు ఫ్లాప్‌ పాటలు చేద్దామంటూ రారు’ అని అన్నారు. అనంతరం, తన తండ్రి మరణాన్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Read latest Cinema News and Telugu News


Tags :
Published : 21 Dec 2021 15:08 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు