Kurup Review: రివ్యూ: కురుప్

చిత్రం: కురుప్; నటీనటులు: దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ్ల, ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, సన్నీ వేన్, భరత్ నివాస్ తదితరులు; సంగీతం: సుశీన్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి, దర్శకత్వం: శ్రీనాథ్ రాజేంద్రన్; నిర్మాణం: వే ఫారర్ ఫిల్మ్స్ & ఎం-స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్; విడుదల: 12 నవంబర్ 2021
దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ‘ఓకే బంగారం’, ‘మహానటి’, ‘కనులు కనులను దోచాయంటే’.. తదితర చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. అందుకే ఆయన ఏ భాషలో నటించినా ఆ సినిమాలు తెలుగులోనూ అనువాదం అవుతుంటాయి. పాన్ఇండియా చిత్రంగా ఇటీవల రూపొందిన ‘కురుప్’ కూడా తెలుగులో విడుదలైంది. మరి, ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం..!

కథేమిటంటే: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు కురుప్. అతని వాస్తవ నేర జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కేరళలో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి గోపీకృష్ణన్ కురుప్ అలియాస్ జీకేగా మొదలైన అతని జీవితం ఆ తర్వాత ఎలా మారింది? సుధాకర కురుప్‌గా, అలెగ్జాండర్‌గా అతను ఎలా మారాడు? దారితప్పిన యువకుడైన కురుప్ జల్సాలు, విలాసాలకు అలవాటు పడి ఎలాంటి దురాగతాలకి పాల్పడ్డాడు? జీవితంలో సెటిల్ అయిపోవడం కోసం ఏం చేశాడు? అతని కోసం అన్వేషణ ప్రారంభించిన పోలీసు అధికారులకు ఎలాంటి విషయాలు తెలిశాయనే అంశాల చుట్టూ సాగే కథ ఇది. కురుప్‌గా దుల్కర్ సల్మాన్, అతని ప్రేయసి శారదాంబగా శోభిత ధూళిపాళ్ల నటించారు.
ఎలా ఉందంటే: కురుప్ నేరమయ జీవితం ఆరంభం నుంచి అతని గురించి చివరిగా తెలిసిన విషయాల వరకూ సాగే కథ ఇది. కిల్లర్ కురుప్ జీవితం ఆధారంగా సినిమా అనగానే కేరళలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక నేరస్థుడిని హీరోగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. కానీ ఈ కథని దర్శకుడు అలా చూపించలేదు. కథానాయకుడిని ఓ కరడుగట్టిన కిల్లర్‌గానే చూపించాడు. 1970, 80, 90 దశకాల్లో సాగే ఓ పీరియాడికల్ కథగా దర్శకుడు ఈ కథని మలిచాడు. పాత్రల్ని పరిచయం చేయడం కోసం సమయం తీసుకున్న దర్శకుడు మెల్లగా కథలోకి తీసుకువెళ్లాడు. కురుప్‌కి పీటర్‌తో స్నేహం మొదలుకొని, అతడు నేరాలకి పాల్పడే తీరు, అందులో నుంచి బయటపడే విధానం ఆసక్తికరంగా సాగుతుంది. ఒక క్రిమినల్ ఎంత క్రూరత్వంతో ఉంటాడో.. అవన్నీ దుల్కర్ తన నటనతో చక్కగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.

కురుప్ పాత్రని ఎక్కడా హీరో అన్నట్టు చూపించకుండానే ఆ పాత్రని స్టైలిష్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాల్లో స్పష్టత లోపించినట్టు అనిపించినా, సింహ భాగం సినిమా తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తితో సాగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రం రూపొందినా, అక్కడక్కడా వాణిజ్యాంశాల కోసం స్వేచ్ఛని తీసుకుని సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. గోపీకృష్ణన్ చనిపోయాడని నమ్మించే సన్నివేశాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్, చివరి 30 నిమిషాల డ్రామా సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. అన్ని రకాల జానర్లు కలిసినట్టుగా అనిపించే కథ ఇది. శోభితతో ప్రేమాయణం సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. క్రైమ్ డ్రామాలో ఉండే వేగం ఇందులో లేకపోయినా సహజత్వంతో సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.

ఎవరెలా చేశారంటే: దుల్కర్ సల్మాన్ వన్ మేన్ షోలా ఉంటుందీ చిత్రం. అతను కురుప్ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. నేరం చేసే సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. లుక్స్ పరంగా కూడా ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఆకట్టుకుంటాయి. ఆరంభం నుంచి చివరి వరకు అతను కనిపించే తీరు మెప్పిస్తుంది. శోభిత, పోలీసాఫీసర్‌గా ఇంద్రజిత్ సుకుమారన్ తమ నటనతో కట్టిపడేస్తారు. ప్రాధాన్యంతో కూడిన పాత్రలు చాలానే ఉన్నా, ఎక్కువ సన్నివేశాల్ని దుల్కర్ తన భుజాలపై వేసుకుని నడిపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రథమార్ధంలో సన్నివేశాలు కొన్ని సాగదీతగా అనిపించినా, పాత్రల్ని బలంగా ఆవిష్కరించడానికి అది అవసరం అనిపిస్తుంది. సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. పీరియాడిక్‌గా సాగే ఈ సినిమా కోసం నిర్మాణ పరంగా తీసుకున్న జాగ్రత్తలు చిత్రానికి ప్రధాన బలం. దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ ఎంతో పరిణతితో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఓ క్రిమినల్ కథని, అదే తరహాలో ఎలాంటి హీరోయిజం లేకుండా దుల్కర్ సల్మాన్ లాంటి ఓ కథానాయకుడితో తీయడం మెచ్చుకోదగ్గదే. కొన్ని సన్నివేశాలు గందరగోళంగా అనిపించినా చాలా వరకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ఈ క్రైమ్ డ్రామాని. రకరకాల జానర్లతో ఓ కథని ఎలా తీయొచ్చో చూపించాడు.
బలాలు
+దుల్కర్ సల్మాన్ నటన
+నటీనటులు
+నేర నేపథ్యంలో సాగే డ్రామా
+పతాక సన్నివేశాలు
బలహీనతలు
-గందరగోళంగా కొన్ని సన్నివేశాలు
-సాగదీతగా అనిపించే ప్రథమార్ధం
చివరిగా: ఆసక్తికరంగా సాగే ఓ కిల్లర్ కథ ‘కురుప్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఆ సినిమా నా కెరీర్‌ను మలుపుతిప్పింది: అనిల్ రావిపూడి
‘మన శంకరవరప్రసాద్ గారు’లో మూడో పాటను తాజాగా విడుదల చేశారు. -

‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
Salman Khan Movie: సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’పై చైనా చేసిన ఆరోపణలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. -

మెగా విక్టరీ మాస్ సాంగ్: ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ..
‘మన శంకరవరప్రసాద్ గారు’నుంచి మూడో విడుదలైంది.
-

మోహన్‌లాల్ మాతృమూర్తి కన్నుమూత
ప్రముఖ మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్ తల్లి శాంతకుమారి(90) కన్నుమూశారు. -

ఓటీటీలోకి ‘బ్యూటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘బ్యూటీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మూడు నెలల తర్వాత ఇది ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’.. చైనా మీడియా అక్కసు
Salman Khan Movie: సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమాపై చైనా మీడియా అక్కసు వెళ్లగక్కింది. -

45ఏళ్లుగా ఎప్పుడూ దాన్ని మిస్ చేయలేదు: ఫిట్‌నెట్ సీక్రెట్ చెప్పిన నాగార్జున
66 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపించడం వెనక ఉన్న సీక్రెట్‌ను నాగార్జున పంచుకున్నారు. -

దిష్టి తీయించుకోమని చిరంజీవికి చెప్పా: అనిల్ రావిపూడి
‘మన శంకరవరప్రసాద్ గారు’ సాంగ్ లాంచ్ ఈవెంట్ గుంటూరులో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అనిల్ రావిపూడి మాట్లాడారు. -

రిద్ది కుమార్‌కు శారీ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. అసలు విషయమిదే..!
ఇటీవల జరిగిన ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి రిద్ది కుమార్ స్పీచ్ వైరలైన విషయం తెలిసిందే. తాజాగా దాని గురించి ఆమె వివరించారు. -

అభిమాని పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేసిన సూర్య.. వధువు రియాక్షన్ హైలైట్..
తన అభిమాని పెళ్లికి సూర్య వెళ్లి ఆమెను సర్ప్రైజ్ చేశారు.
-

‘జన నాయగన్’ ఈవెంట్ రికార్డు.. ఎంతమంది హాజరయ్యారంటే!
విజయ్ ‘జన నాయగన్’ రికార్డు సాధించింది. అత్యధిక మంది హాజరైన తమిళ సినిమా ఈవెంట్‌గా నిలిచింది. -

ఈసారికి సారీ... 2026లోనే వస్తాం మరి..!
2026కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సినిమా లెక్కలకూ సమయమైంది. మరి అందులో బాలీవుడ్ భామల వాటా ఎంతుందో చూద్దామా! జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటూ తెరపై సందడి చేసే బాలీవుడ్ సోయగాల మెరుపులు ఈ ఏడాది ఎక్కువగా కనిపించనేలేదు. -

ఇది ‘రాజాసాబ్’ టైమ్
‘‘మన టైమ్ మొదలైంది..’’ అంటున్నారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పుడాయన సంక్రాంతి బరిలో ‘ది రాజాసాబ్’ సినిమాతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. -

సీజన్ 2లో ఆ ప్రశ్నలకు సమాధానం
‘‘సింహం, చిరుత.. ఇలాంటి మృగాలు ఎన్ని చేసినా.. ఆ జింక బెదరలేదు. ఎందుకంటే అది జింకే కాదు’’ అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో ప్రశాంత్ కుమార్ దిమ్మెల తెరకెక్కించారు. -

ఓటీటీలో ఈ వారం
2025కు వీడ్కోలు చెప్పే కథలు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే చిత్రాల కోసమే కదా ప్రేక్షకుల ఎదురుచూపులు. ఓటీటీలు కూడా 2026కి వెల్కమ్ చెప్తూ.. సినీప్రియులకు ఈ వారాంతం నాన్‌స్టాప్‌గా వినోదాలు పంచడానికి కొత్త కంటెంట్‌తో సిద్ధంగా ఉన్నాయి. -

కథాబలం లేకపోతే ఇద్దరికీ నష్టమే
‘సైక్ సిద్ధార్థ’ చిత్రాన్ని దర్శకుడు వరుణ్ రెడ్డి చాలా విభిన్నంగా తెరకెక్కించారని నిర్మాత డి సురేశ్‌బాబు అన్నారు. అందుకే సినిమా చూసిన వెంటనే తాము కొన్నట్లు తెలియజేశారు. దీన్ని రూ.99 టికెట్ ధరతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. -

‘పతంగ్’ ఎగిరేవరకూ రాజీ పడలేదు!
ఓ సంక్రాంతి పండుగ రోజున తట్టిన ఆలోచనే ‘పతంగ్’ రూపొందడానికి కారణమని, సినిమాకి లభిస్తున్న స్పందన ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రణీత్ పత్తిపాటి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పతంగ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. -

మార్చిలో అల్లు శిరీష్ పెళ్లి
నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ ఏడాది అక్టోబరులో ఆయనకు.. తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. -

సంక్షిప్త వార్తలు (3)
‘పెద్ది’గా సినీప్రియుల్ని పలకరించనున్నారు కథానాయకుడు రామ్‌చరణ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. -

ఒక్క సినిమాకే రూ.19 వేల కోట్లు.. ఈ ఏడాదిలో ప్రపంచంలోనే టాప్
ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే..
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

అమ్మాయిలు అదరహో.. శ్రీలంకతో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్
-

న్యూ ఇయర్ వేళ క్యాబ్, ఆటో డ్రైవర్లకు సజ్జనార్ హెచ్చరిక
-

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
-

అభిప్రాయ సేకరణ తర్వాతే రుషికొండ భవనాలపై తుది నిర్ణయం: ఎమ్మెల్యే గంటా
-

టీ20 ప్రపంచ కప్.. శ్రీలంక పేసర్లకు లసిత్ మలింగ పాఠాలు
-

దుర్గం చెరువు ఆక్రమణలకు చెక్ పెట్టిన హైడ్రా


