Punarapi Jananam: అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు తెలుగు లఘు చిత్రం.. ‘పునరపి జననం’

Eenadu icon
By Entertainment Team Published : 30 Oct 2025 19:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు లఘు చిత్రం ‘పునరపి జననం’ (Punarapi Jananam) అంతర్జాతీయ వేదికపై మెరవనుంది. మహాదేవ్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ ఈజిప్షియన్‌ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Egyptian American Film Festival)కు అధికారికంగా ఎంపికైంది. న్యూయార్క్‌ వేదికగా ఈ నెల 31 నుంచి నవంబరు 2 వరకు వేడుక జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 5100కి పైగా లఘు చిత్రాలు పోటీ పడగా.. వాటిలో భారతదేశం నుంచి ఎంపికైన మూడు షార్ట్ ఫిల్మ్‌లలో ఒకటిగా ‘పునరపి జననం’ నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు మహాదేవ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు గర్వకారణమైన క్షణం. పునరపి జననం.. మనం ప్రకృతితో కలసి జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే కథ. ప్రకృతిని కాపాడటం అంటే జీవితాన్ని కాపాడటమే” అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు