‘తండేల్’అంటే అర్థమదే.. చైతన్య, సాయిపల్లవికి ఇద్దరికీ అవార్డులొస్తాయి!

Thandel Meaning (హైదరాబాద్): ‘తండేల్’లో నటకుగానూ నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) ఇద్దరికీ అవార్డులు వస్తాయని నిర్మాత అల్లు అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. చందూ మొండేటి దర్శకత్వంతో రూపొందిన చిత్రమిది. బన్నివాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు వచ్చిన ఈ మూవీని ఫిబ్రవరి 7న విడుదల (Thandel release date) చేయనున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విలేకరులు (thandel movie press meet) అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి వాయిదా వేయడానికి కారణం?
అల్లు అరవింద్: సంక్రాతికి రావాలని అందరూ అనుకుంటారు. తాజాగా జరుగుతోన్న పరిణామాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. రానున్న సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలున్నాయి. వాటికి థియేటర్లు షేర్ అవుతాయి. మాకు ఏ పోటీ లేకుండా రావాలని ఉంది. అందుకే ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నాం. మార్చి మొదటి వారంలో పరీక్షలు ఉన్నాయి. అందుకే ఫిబ్రవరి 28 చేయలేదు.
‘పుష్ప’తో అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు వచ్చింది.. తండేల్తో సాయి పల్లవికి కూడా ఇలాంటి అవార్డు వస్తుందా?
అల్లు అరవింద్: ఈ సినిమా సాయి పల్లవికి, నాగచైతన్యకు నేషనల్ అవార్డు తీసుకురావాలని కోరుకుంటున్నా. అది జరిగే అవకాశం ఉంది.
ఈ మధ్య బాయ్‌కాట్ సాయిపల్లవి ట్రెండ్ అవుతోంది. రూ.100కోట్ల క్లబ్లో చేరుతుందనుకుంటున్నారా?
బన్నివాసు: రూ.100కోట్ల క్లబ్లో చేర్చడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాం. అది నా విష్. నెరవేరాలని కోరుకుంటున్నాం. ఇందులో మంచి కంటెంట్ ఉంది.
100పర్సంట్ లవ్ తర్వాత నాగచైతన్యతో మళ్లీ ఇన్ని రోజులకు సినిమా చేస్తున్నారు? ఆయనలో ఏమైనా మార్పు చూశారా?
బన్నివాసు: ఆయన అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పడూ అలానే ఉన్నారు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారు.
‘పుష్ప2’ విడుదల విషయంలోనూ మీరు సలహా ఇచ్చారా?
అల్లు అరవింద్: లేదు. ఆ సినిమా రిలీజ్ కోసం పెట్టిన మీటింగ్‌లో నేను పాల్గొన్నాను. కానీ, విడుదలపై సలహా ఇవ్వలేదు.
ఈ సినిమాను తెలుగు,తమిళ, హిందీలోనే విడుదలచేస్తున్నారా.. మిగతా భాషల్లో కూడా రిలీజ్ అవుతుందా?
అల్లు అరవింద్: ఈ మూడు భాషలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. మలయాళం, కన్నడలో కూడా విడుదల చేస్తాం. ఈ మధ్య ఒక సినిమా పోస్టర్ విడుదల చేసి 14 భాషల్లో రిలీజ్ అంటున్నారు. మేము అలా చేయాలని అనుకోవడం లేదు.
‘తండేల్’ అని టైటిల్ పెట్టడానికి కారణం?
చందూ: ‘తండేల్’ అనేది సినిమా చర్చల సమయంలోనే తెలుసుకున్నాం. ‘తండేల్’ అంటే లీడర్ అని అర్థం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. మరో ప్రెస్‌మీట్ పెడతాం (నవ్వుతూ)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

అందుకే ‘భవదీయుడు భగత్‌సింగ్’ మారింది: హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ గురించి దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -

షూటింగ్ లేకపోతే రోజూ ఒక్క కథైనా వింటా!
మనలో ఒకడిలా కనిపిస్తాడు శ్రీవిష్ణు. మన చుట్టూ జరిగేవే ఆయన సినిమాల్లో కథలు. వరుస విజయాల వెనక రహస్యం అదేనేమో! ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకునే సినిమాలకు చిరునామాగా నిలుస్తున్న శ్రీవిష్ణు ఈరోజు ‘విష్ణు విన్యాసం’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -

ముంబయిలో షూటింగ్.. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన ప్రభాస్
‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ ప్రభాస్‌ను కలిసింది. ఆ చిత్ర బృందంతో ప్రభాస్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -

అందుకే సినిమాల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశా..: రానా
నటుడు రానా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. -

‘వరుస సినిమాలు చేయకపోతే కనిపించకుండా పోతావు’ అన్నారు: శివానీ
తనకు 100 సినిమాలు చేసేయాలని లేదని, ప్రేక్షకులు తనకు ఇచ్చిన విలువను కాపాడుకోవడమే ముఖ్యమని అంటున్నారు కథానాయిక శివానీ నాగరం (Shivani Nagaram). అందుకే కథ, పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తున్నానని అన్నారు. -

‘వారణాసి’ సైన్స్ ఫిక్షన్ మూవీనా?.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
‘వారణాసి’ జానర్‌పై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. -

వైబ్ మ్యాచ్ అయితేనే పెళ్లి.. జెన్-జీకి లావణ్య త్రిపాఠి సలహా
ప్రెగ్నెన్సీతోనే ‘సతీ లీలావతి’ సినిమా మొత్తం పూర్తి చేశానని లావణ్య త్రిపాఠి అన్నారు. -

వీఎఫ్ఎక్స్.. తొందరపడితే ప్రేక్షకులు క్షమించడం లేదు: నిఖిల్
‘‘పేర్లు చెప్పను కానీ, వీఎఫ్ఎక్స్ విషయంలో కొన్ని సినిమాలు తొందరపడ్డాయి. వాటికి చాలా నష్టం జరిగింది. ‘స్వయంభు’ (Swayambhu) చిత్రానికి అలా జరగకూడదనే ఆలస్యమైనా మంచి అవుట్‌ఫుట్‌తో వస్తున్నాం’’ -

‘ప్రిన్స్’ అందుకే ఆడలేదు.. ‘ఫంకీ’ విషయంలో అలా జరగదు: కేవీ అనుదీప్
‘‘మన సృష్టించే ప్రపంచం, పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడాలి. అప్పుడే ప్రేక్షకులకు చేరువ అవుతాం’’అంటున్నారు దర్శకుడు కేవీ అనుదీప్. -

అందుకే.. మరో జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అని చెప్పాను: గుణశేఖర్
గుణశేఖర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రెస్మీట్లో పాల్గొంది. -

రాముడిగా కనిపిస్తాను..: ‘వారణాసి’లో తన పాత్ర గురించి చెప్పిన మహేశ్
‘వారణాసి’లో నటించడానికి మొదట భయపడినట్లు మహేశ్ బాబు వివరించారు. -

పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ నిర్ణయం.. కుమార్తె స్పందన ఇదీ!
సౌందర్యా రజనీకాంత్ నిర్మించిన సినిమా ‘విత్ లవ్’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో.. తన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయంపై ఆమె స్పందించారు. -

తరుణ్ భాస్కర్ ఆ సీన్లో నిజంగానే చెంపదెబ్బ కొట్టారు: ఈషా రెబ్బా
కెరీర్లో ఒక్కసారైనా శాంతిలాంటి పాత్ర చేయాలని అనుకునేదాన్నని.. ‘ఓం శాంతి శాంతి శాంతిః’తో (Om Shanti Shanti Shantihi) ఆ కోరిక నెరవేరిందని అంటోంది ఈషా రెబ్బా (Eesha Rebba). -

‘ఖైదీ 2’ అప్పుడే.. ‘ఎల్సీయూ’ ఆగిపోలేదు..: లోకేశ్ కనగరాజ్ క్లారిటీ
‘ఖైదీ 2’పై వచ్చిన రూమర్స్‌పై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పందించారు. -

పవన్‌కల్యాణ్‌తో మూవీపై క్లారిటీ.. టైటిలే విచిత్రంగా ఉంటుంది: అనిల్ రావిపూడి
తన తర్వాతి చిత్రం కూడా 200శాతం ఎంటర్‌టైనరేనని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పష్టం చేశారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా మూవీ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu). -

అలాంటి లెక్కలు వేసుకోను!
‘గూఢచారి’, ‘మేజర్’ విజయాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నటి శోభితా ధూళిపాళ్ల. ఇప్పుడామె తొలిసారి తెలుగులో ‘చీకటిలో’ అనే ఓటీటీ చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. దీన్ని శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించగా.. డి సురేశ్‌బాబు నిర్మించారు. -

‘యుఫోరియా’.. అందుకే నాపై కోపం వస్తుంది: గుణశేఖర్
తన కొత్త సినిమా ‘యుఫోరియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -

‘మన శంకరవరప్రసాద్‌గారు’కు చిరంజీవి పారితోషికం.. అనిల్ ఏమన్నారంటే?
చిరంజీవితో సినిమా అనుకున్న తర్వాత ఆయనకు తనకూ ఓ మినీ ఛాలెంజ్ జరిగిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. -

తొలిరోజే సెట్లో ఏడ్చేశా..
‘ ‘గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని పండగ విజయాన్ని అందుకున్నా. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాననే నమ్మకముంది’’ అంటోంది నటి మీనాక్షి చౌదరి. -

అందుకేనేమో నయన్ ప్రమోషన్స్ చేశారు.. అది మెగా మ్యాజిక్: అనిల్ రావిపూడి
సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే ట్రాక్ రికార్డు ఉన్నా, అలా ముద్ర పడటం మంచిది కాదని, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి.








