VarunLav: వరుణ్‌-లావణ్య.. వివాహ విందు

వెండితెరపై జంటగా కనిపించి మురిపించిన నాయకానాయికలు వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు.

Updated : 06 Nov 2023 14:03 IST

వెండితెరపై జంటగా కనిపించి మురిపించిన నాయకానాయికలు వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి విందు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరుణ్‌-లావణ్యల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక కోలాహలంగా జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై.. కొత్త దంపతుల్ని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని