upcoming movies: ఈ వారం థియేటర్‌ / ఓటీటీ చిత్రాలివే!

upcoming movies in telugu: 2024లో ఫిబ్రవరి మాసం ముగింపునకు వచ్చేసింది. మార్చిలో అనేక చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మార్చి మొదటి వారంలో అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలేంటో చూసేయండి.

Published : 26 Feb 2024 09:50 IST

వరుణ్‌తేజ్‌ సరికొత్త ప్రయోగం

కమర్షియల్‌ సినిమాలతో పాటు, ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపే నటుడు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ ముద్ద నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణపూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్‌తేజ్‌ భారత వైమానిక దళ అధికారి పాత్రలో నటిస్తుండగా, మానుషి రాడార్‌ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారు. వరుణ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులో కనిపించనున్నారు.


భూతద్దం భాస్కర్‌ ఏం చేశాడు?

కలియుగంలో భూమిపైన జన్మించి.. ఏ ఉపద్రవం తలెత్తకుండా చూస్తానంటూ అభయం ఇస్తాడు పైలోకంలో విష్ణుమూర్తి. కట్‌ చేస్తే.. భూమిపైన పోలీస్‌ జీపు నుంచి స్టైల్‌గా దిగాడు హీరో. మరి ఆ విష్ణుమూర్తికీ, ఈ హీరోకీ సంబంధమేమిటో తెలియాలంటే మాత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ చూడాల్సిందే. శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రాశిసింగ్‌ కథానాయిక. పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశీ, కార్తీక్‌ ముడుంబై నిర్మాతలు. మార్చి 1న  ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.


నవ్వుల ‘ఏజెంట్‌’

వెన్నెల కిశోర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘చారి 111’ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అదితి సోనీ నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్‌కి జోడీగా సంయుక్త విశ్వనాథన్‌ నటించారు. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. ‘ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ చిత్రం. ఎప్పుడూ ఏదో ఒక గమ్మతైన తప్పు చేసే ఓ గూఢచారి పెద్ద కేస్‌ని ఎలా పరిష్కరించాడనేది తెరపైనే చూడాలి. నాయకా నాయికలిద్దరూ గూఢచారులుగా కనిపిస్తారు. వాళ్లకి బాస్‌గా మురళీశర్మ కనిపిస్తారు. థియేటర్లకి వచ్చిన ప్రేక్షకుల్ని మా చారి కడుపుబ్బా నవ్విస్తాడు’ అని చిత్ర బృందం చెబుతోంది.


ఈ వారం ఓటీటీలో చిత్రాలు/సిరీలు ఇవే!

‘బూట్‌కట్‌ బాలరాజు’ సందడి

సొహెల్‌ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన సినిమా ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju). మేఘ లేఖ కథానాయిక. సునీల్‌, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. విడుదలై నెలరోజులు కూడా కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. తెలుగులో ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ‘‘మన ‘బూట్ కట్ బాలరాజు’ ఇక ఊరు, వాడ, పిల్లా, జల్లా అందరూ రెడీగా ఉండుర్రి’’ అని ట్వీట్ చేసింది.

 • ఓటీటీలో వచ్చే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు
 • నెట్‌ఫ్లిక్స్‌
 • కోడ్‌ 8 (హాలీవుడ్‌) ఫిబ్రవరి 28
 • మామ్లా లీగల్‌ హై (హిందీసిరీస్‌) మార్చి 1
 • స్పేస్‌మ్యాన్‌ (హాలీవుడ్) మార్చి 1
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • వెడ్డింగ్‌ ఇంపాజిబుల్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 26
 • ఎనీవన్‌ బట్‌ యూ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 27
 • పూర్‌ థింగ్స్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 27
 • నైట్‌ స్విమ్‌ (హిందీ ) మార్చి 1
 • జీ5
 • సన్‌ఫ్లవర్‌ (హిందీ సిరీస్‌2) మార్చి 1
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని