Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
Telugu movies: ఈ వారం అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించనున్న చిత్రాలేంటో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాల సందడి లేకపోవడంతో వారానికి ఐదారు కొత్త సినిమాలు బాక్సాఫీస్‌ను పలకరిస్తున్నాయి. అలా ఈ వారం కూడా కొన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి వాటితో పాటు, ఓటీటీలోనూ అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.
సస్పెన్స్ థ్రిల్లర్‌తో సమంత
సమంత (Samantha) నేరుగా తెలుగు సినిమాలో నటించి చాలా రోజులైంది. ‘జాను’ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం ‘యశోద’ (Yashoda ). హరి, హరీష్ దర్శకులు. వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సరోగసి నేపథ్యంలో సాగే ఉత్కంఠ భరిత కథనంతో దర్శకులు ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ఈ సినిమా కోసమే సెలైన్ పెట్టుకుని మరీ తన డబ్బింగ్ పూర్తి చేశారు. అంతేకాదు, ఈ సినిమా కోసం సామ్ యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించారు. దీంతో ‘యశోద’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ సంగీత దర్శకుడు.
నచ్చిన గర్ల్‌ఫ్రెండ్.. అబ్బాయిని మెచ్చిన గర్ల్‌ఫ్రెండ్
‘ఆటగదరా శివ’, ‘మిస్ మ్యాచ్’ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ శంకర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నచ్చింది గళ్ ఫ్రెండూ’ (Nachindi girlfriend). గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఒక కథతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమకథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది.
‘మది’ని దోచేలా...
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన చిత్రం ‘మది’ (Madhi). నాగధనుష్ దర్శకత్వం వహించారు. రామ్‌కిషన్ నిర్మాత. పీవీఆర్ రాజా స్వరకర్త. యువతరానికి నచ్చే మంచి కథతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ‘మది’లో ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 11న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది.
స్టార్ నటులతో..
అమితాబ్‌బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊంచాయి’. ప్రేమ కథ నిండిన కుటుంబ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శక-నిర్మాత సూరజ్ బర్జాత్య దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక విభిన్న కథతో రూపొందిన ఈ చిత్రం నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్ వీడియో
* బ్రీత్ : ఇన్ టు ది షాడోస్ (హిందీ సిరీస్2) నవంబరు 9
* ఇరావిన్ నిగళ్ (తమిళ చిత్రం) నవంబరు 11
* సిక్సర్ (హిందీ సిరీస్) నవంబరు 11
నెట్‌ఫ్లిక్స్
- బిహైండ్ ఎవ్రీ స్టార్ (కొరియన్ సిరీస్) నవంబరు 8
- ద క్లాజ్ ఫ్యామిలీ 2 (డచ్ సిరీస్) నవంబరు 8
- ట్రివియా వర్స్ (హాలీవుడ్) నవంబరు 8
- ద క్రౌన్ (వెబ్ సిరీస్) నవంబరు 9
- ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ ) నవంబరు 10
- లాస్ట్ బుల్లెట్ (ఫ్రెంచ్ మూవీ) నవంబరు 10
- వారియర్ నన్ (వెబ్‌సిరీస్-2) నవంబరు 10
- మోనికా ఓ మై డార్లింగ్ (హిందీ) నవంబరు 11
- ఏన్సెంట్ అపోకలిప్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 11
- థాయ్ మసాజ్ (హిందీ) నవంబరు 11
జీ5
- ముఖ్‌బీర్ (హిందీ సిరీస్) నవంబరు 11
సోనీ లివ్
- తనావ్ (హిందీ సిరీస్) నవంబరు 11
లయన్స్ గేట్ ప్లే
- హాట్‌సీట్ (హాలీవుడ్) నవంబరు 11
డిస్నీ పస్ల్ హాట్‌స్టార్
- సేవ్ ఔర్ స్క్వాడ్ (ఒరిజినల్ సిరీస్) నవంబరు 09
- మనీ మాఫియా (హిందీ సిరీస్3) నవంబరు 10
- రోషాక్ (తెలుగు) నవంబరు 11
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్