Urvasivo Rakshasivo: ఫుల్ ఫన్ + కాసింత రొమాన్స్ = ‘ఊర్వశివో రాక్షసివో’ ట్రైలర్
కెరీర్‌లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు అల్లు శిరీష్. ‘ఏబీసీడీ’ తర్వాత అతడు నటించిన కొత్త చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’.
హైదరాబాద్: అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) జంటగా నటించిన కొత్త చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). రాకేశ్ శశి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మధ్య తరగతి, సంప్రదాయ కుటుంబానికి చెందిన అబ్బాయి.. ఓ ట్రెండీ అమ్మాయితో ప్రేమలో పడటం.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైనట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
శిరీష్, అను మధ్య వచ్చే లవ్ సీన్స్, వెన్నెల కిషోర్ కామెండీ టైమింగ్‌తో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘‘తను కొరియన్ వెబ్‌సిరీస్‌లా ట్రెండీగా ఉంటే నువ్వెంట్రా ‘కార్తికదీపం’ సీరియల్‌లో డాక్టర్‌బాబు, వంటలక్కలా పేజీలు పేజీలు డైలాగ్స్ చెబుతున్నావ్’’, ‘‘ఇన్ని ఈ.ఎమ్.ఐలు ఉన్నావాడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా. అది బేసిక్స్’’ అంటూ వెన్నెల కిషోర్ వేసే పంచులు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ
-
Politics News
Nara Lokesh: పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది: లోకేశ్
-
Sports News
IPL Final: అహ్మదాబాద్‌లో వర్షం.. మ్యాచ్ నిర్వహణపై రూల్స్ ఏం చెబుతున్నాయి?