varun tej: కుటుంబం ఆదేశిస్తే ‘జనసేన’ తరఫున ప్రచారం చేస్తా: వరుణ్‌తేజ్‌

Eenadu icon
By Entertainment Team Published : 21 Feb 2024 14:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విజయవాడ: తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌తో (Pawan kalyan) కలిసి నటించడం తనకూ ఇష్టమేనని, అయితే అలాంటి కథలేవీ ప్రస్తుతం లేవని కథానాయకుడు వరుణ్ తేజ్‌ (varun tej) అన్నారు. ఆయన కీలకపాత్రలో శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.  సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది. వచ్చే ఎన్నికల్లో కుటుంబపెద్ద ఆదేశిస్తే తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ చెప్పారు.

‘‘విజయవాడకు రావడం ఆనందంగా ఉంది. తెలుగులో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంగా ఇప్పటివరకూ ఎలాంటి సినిమా రాలేదు.  ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఆ లోటు తీరుస్తుంది. దేశభక్తి నేపథ్యంగా సాగే కథ ఇది. మార్చి 1న  ప్రేక్షకుల ముందుకురానుంది. కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తే జరగవు. ఇది అలాంటిదే. ‘కంచె’ తరువాత ఇలాంటి సినిమా రావడం అదృష్టంగా భావిస్తున్నా. పుల్వమా ఘటనల నేపథ్యంలో దీన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న పుల్వామా బ్లాక్ డే ఘటన జరిగింది. అదేరోజు వాలెంటైన్ డే కావడంతో సినిమాకు ‘ఆపరేషన్ వాలెంటైన్’ పేరు పెట్టాం. యుద్ధ విమానాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. వీఎఫ్ఎక్స్ సాయంతో అత్యుత్తమంగా వాటిని తీర్చిదిద్దారు. ఈ మూవీ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని వరుణ్‌ తేజ్‌ అన్నారు.

గతంలోనూ తన తండ్రి నాగబాబు ప్రచారం చేసినప్పుడు తానూ వెళ్లానని వరుణ్‌ అన్నారు. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌, ఆయన నమ్మే సిద్ధాంతాలు నడిచే దారిపై తనకు నమ్మకం ఉందని,  ఆ విషయంలో ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తానని వరుణ్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు