Varun Tej Lavanya: పెళ్లిసందడి

తెరపై జంటగా కనిపించి అలరించిన  వరుణ్‌తేజ్‌ - లావణ్య త్రిపాఠి జోడీ  నిజ జీవితంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు.

Updated : 01 Nov 2023 14:48 IST

తెరపై జంటగా కనిపించి అలరించిన  వరుణ్‌తేజ్‌ - లావణ్య త్రిపాఠి జోడీ  నిజ జీవితంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. వీరి వివాహం బుధవారం ఇటలీలో జరుగుతుంది. ఈ వేడుక కోసం  చిరంజీవి కుటుంబంతోపాటు, వధూవరుల సన్నిహితులు రెండు రోజుల ముందే ఇటలీకి చేరుకున్నారు.  మంగళవారం హల్దీ, మెహందీ కార్యక్రమాల్ని నిర్వహించారు. వధూవరులు పసుపు వర్ణం దుస్తులతో ధగధగ మెరిసిపోయారు.  ఏడడుగులు వేస్తున్న కొత్త జంటతో చిరంజీవి, సురేఖ దంపతులు కలిసున్న ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు