varun tej: ప్రేక్షకులు గర్వపడేలా... ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’

Eenadu icon
By Cinema Desk Updated : 07 Feb 2024 09:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘‘మన దేశానికి నిజమైన సూపర్‌హీరోలు సైనికులే. వాళ్ల కథని ప్రేక్షకులు గర్వించేలా తెరపైకి తీసుకొచ్చాం’’ అన్నారు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మానుషి చిల్లర్‌ కథానాయిక. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించారు. సందీప్‌ ముద్దా నిర్మాత. ఈ చిత్రాన్ని మార్చి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ‘గగనాల...’ అంటూ సాగే ఈ చిత్రంలోని రెండో గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి సాహిత్యం అందించగా, అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరకర్త. పాట విడుదల అనంతరం వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘మనందరికీ కుటుంబాలు, స్నేహాలు ఉంటాయి. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ సైనికుడు దేశం మొత్తాన్ని తన కుటుంబంగా భావించి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. అలాంటి సైనికుల కోసం, వాళ్లు చేసిన త్యాగాల కోసం, వాళ్ల కథని ప్రేక్షకులకు చెప్పాలనే ఓ గొప్ప ఉద్దేశం ఈ సినిమా వెనక ఉంది. ఇందులో ఓ మంచి ప్రేమకథ కూడా ఉంది. ‘గగనాల...’ పాట అందరికీ నచ్చింది’’ అన్నారు. మానుషి మాట్లాడుతూ ‘‘అందరూ గర్వించే ఓ అద్భుతమైన చిత్రమిది. వాలెంటైన్స్‌ డే సమయంలో ఈ ప్రేమ పాటని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పింది.

Tags :
Published : 07 Feb 2024 01:07 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు