కెరియర్‌ని ప్రేమని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉండేది: వరుణ్ తేజ్

హైదరాబాద్: ప్రేమకథా చిత్రాలతో మెప్పించిన వరుణ్ తేజ్ (Varun Tej) తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ లావణ్యా త్రిపాఠితో తన ప్రేమ గురించి మాట్లాడారు.‘‘సినీ ఇండస్ట్రీలో ప్రతి విషయాన్ని ప్రేక్షకులు అభిమానులు తెలుసుకోవాలనుకుంటారు. ఆసక్తి చూపిస్తారు. అలా మా బంధం గురించి మాట్లాడుకోవడం మాకు ఇష్టం లేదు. అందుకే మా ప్రేమ గురించి ఎవరీ చెప్పలేదు. మొదట్లో బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉన్నా చివరికి సాధ్యమైంది. అందులోను సమస్యలున్నాయి. అప్పుడప్పుడూ ఒత్తిడి తగ్గించుకోడానికి స్వేచ్ఛగా ఎటైనా వెళ్లాలనుకునేవాళ్లం. చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సాధించాలి. విజయవంతమైన సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు కెరియర్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం. అదే సరైన నిర్ణయం అనిపించింది’’ అని వరుణ్‌తేజ్ తెలిపారు.
ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇందులో వరుణ్ పైలట్‌గా నటించారు. మానుషి చిల్లర్ కథానాయిక. తెలుగు, హిందీ భాష్లో రూపొందిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. - 
                                    
                                        

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో ‘మంజుమ్మల్ బాయ్స్ ’ అదరగొట్టింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


