Yashoda: సాహసాల ‘యశోద’ వచ్చేస్తోంది
సమంత (Samantha) ఇప్పుడు పరిపూర్ణమైన నటి. తొలినాళ్లలో గ్లామర్ తారగా సందడి చేసిన ఆమె.. కొన్నాళ్లుగా తనలోని నటిని ఆవిష్కరించే కథల్ని ఎంపికచేసుకుంటూ ప్రయాణం చేస్తోంది.
ఈటీవీలో ఈరోజు సాయంత్రం 6:30గం.లకు ప్రసారం
సమంత (Samantha) ఇప్పుడు పరిపూర్ణమైన నటి. తొలినాళ్లలో గ్లామర్ తారగా సందడి చేసిన ఆమె.. కొన్నాళ్లుగా తనలోని నటిని ఆవిష్కరించే కథల్ని ఎంపికచేసుకుంటూ ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది ‘యశోద’(Yashoda)గా సినీప్రియుల్ని పలకరించి, మురిపించింది. హరి-హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్.. దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వెండితెరపై సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇప్పుడు తొలిసారి బుల్లితెర వేదికగా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ఈరోజు సాయంత్రం 6:30గం.లకు ఈటీవీలో ప్రసారం కానున్న నేపథ్యంలో.. చిత్ర విశేషాలివీ..
కథేంటి
వాస్తవ సంఘటనల ఆధారంగా సరోగసి పేరుతో జరిగే నేరాల చుట్టూ సాగే కథ ఇది. అమ్మతనంలోని గొప్పతనం తెలియకుండా చాలామంది సరోగసిని ఒక వ్యాపారంగా చేస్తుంటే దానిని తప్పుబట్టే అమ్మాయిగా యశోద పాత్రలో సమంత కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల సరోగసికి ఒప్పుకున్న మహిళలందరినీ ఒక రహస్య స్థావరంలో అన్ని సౌకర్యాలతో ఉంచుతారు. అన్నీ బాగున్నాయనుకున్న సమయంలో ఒక ప్రమాదాన్ని కనిపెడుతుంది యశోద. అద్దెగర్భం దాల్చిన మహిళలు డెలివరీ గదిలోకి వెళ్లి తిరిగిరాకపోవడం లాంటి విషయాలను నిశితంగా గమనిస్తుంటుంది. ఆ తరవాత అనుమానస్పదంగా ఒకరు చనిపోవడంతో కథ మలుపు తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ హత్యను చేధించడానికి సమంత చేసిన సాహసాలు అలరిస్తాయి. ఆ తర్వాత ఏమైందనేది ఆసక్తికరం. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
* ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా గర్భవతిగా కనిపించడమే కాక.. డూప్ లేకుండా పోరాటాలు చేసింది.
* ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు యానిక్ బెన్ నేతృత్వం వహించారు. ఆయన గతంలో సమంతతో కలిసి ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’కు పని చేశారు.
* ఈ సినిమా విడుదలకు ముందే సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. కానీ, ఈ చిత్రం ఆలస్యమవ్వకూడదనే ఉద్దేశంతోనే ఓవైపు వ్యాధితో ఇబ్బంది పడుతున్నా సరే.. చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని డబ్బింగ్ పనులు పూర్తి చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PAK vs AFG: చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్‌పై తొలి విజయం
-
General News
Heera gold scam: హీరా గోల్డ్ కుంభకోణం.. రూ.33.06 కోట్ల ఆస్తుల అటాచ్
-
Movies News
Samantha: ఆ సమయంలో బయటకు కూడా రావాలనుకోలేదు: సమంత
-
Politics News
Bandi sanjay: పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్ నిర్వాకమే కారణం: బండి సంజయ్
-
Politics News
Rahul disqualification: రాహుల్‌పై అనర్హత.. భాజపా సెల్ఫ్ గోల్: శశిథరూర్
-
Politics News
Minister KTR: భాజపాకు ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైంది: కేటీఆర్